తెలంగాణాలో  జరిగిన ఎంఎల్ఏ కోటా ఎంఎల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్, ఎంఐఎం అభ్యర్ధులే గెలిచారు. ఎంఎల్సీ ఎన్నికలను కాంగ్రెస్ర్, టిడిపి ఎంఎల్ఏలు బహిష్కరించారు. ముఖ్యమంత్రి కెసియార్ వైఖరికి నిరసనగా ప్రధాన ప్రతిపక్షాలు రెండు బహిష్కరించాయి కాబట్టి ఎన్నిక ఒకవిధంగా ఏకపక్షంగానే సాగిందనే అనుకోవాలి. లాంఛనమే అయిన ఎన్నికల్లో టిఆర్ఎస్ తరపున నలుగురు, మిత్రపక్షం తరపున ఎంఐఎం అభ్యర్ధులు గెలిచినట్లే. అయితే, అధికారికంగా ఇంకా ప్రకటించలేదు లేండి.

 

టిఆర్ఎస్ అభ్యర్ధులుగా శేరి సుభాష్ రెడ్డి, సత్యవతీ రాథోడ్, మహమూద్ ఆలీ, యెగ్గెం మల్లేష్ లు నామినేషన్లు వేయగా ఎంఐఎం తరపున రియాజ్ నామినేషన్ వేశారు. మొత్తంమీద ఏకగ్రీవంగానే ఎన్నికైనట్లైంది. ఎంఎల్ఏ కోటాలో వచ్చే ఎంఎల్సీలన్నింటినీ టిఆర్ఎస్ కైవసం చేసుకోవాలని కెసియార్ వ్యూహం పన్నారు. దాంతో కాంగ్రెస్, టిడిపి ఎంఎల్ఏలను ప్రలోభాలకు గురిచేసి లాగేసుకున్నారు.

 

నిజానికి ప్రతీ ఎంఎల్సీకి 20 మంది ఎంఎల్ఏలు ఓట్లేస్తే సరిపోతుంది. మిత్రపక్షాల హోదాలో కాంగ్రెస్, టిడిపిలు ఒక స్ధానాన్ని గెలుచుకునే అవకాశం ఉంది. అయితే, టిడిపి తరపున గెలిచిన ఇద్దరు ఎంఎల్ఏలు కూడా కాంగ్రెస్ అభ్యర్ధికి ఓట్లేసేది అనుమానంగా తయారైంది. ఎందుకంటే, ఇప్పటికే వాళ్ళిద్దరూ కెసియార్ ను కలిసి టిఆర్ఎస్ లో చేరనున్నట్లు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఇటువంటి పరిస్ధితుల్లోనే అధికారంలోని మిత్రపక్షాలు ఐదుసీట్లను కైవసం చేసుకోవటం గమనార్హం.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: