జేడీ లక్ష్మి నారాయణ..  జగన్ కేసుల ద్వారా బాగా సుపరిచితుడయ్యాడు. అప్పుడు టీడీపీ మీడియా కు జగన్ కేసు గురించి లీకులు ఇస్తూ , కేసు వ్యవహారాన్ని కొనసాగించాడు. దీనితో జేడీ ని టీడీపీ మీడియా ఓ రేంజ్ లో చూపించింది.  అప్పట్లో అధికారంలో ఉండిన కాంగ్రెస్ పార్టీ తొత్తుగా వ్యవహరించారనే విమర్శకు గురయ్యారు. జగన్ కేసుల్లో లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో మోపిన అనేక అభియోగాలు ఆ తర్వాత కోర్టులో చెదిరిపోవడమే అందుకు రుజువు కూడా.


జేడీ లక్ష్మి నారాయణ నీ నీతి, నిజాయతీ ఏమైంది ..!

ఆ సంగతలా ఉంటే.. జగన్ కేసుల్లో విచారణ చేశాడు కాబట్టి.. ఆయన గొప్పోడు అని తెలుగుదేశం పార్టీ ఆయన కోసం కటౌట్లు కట్టినప్పుడే రాజకీయమయం అయిపోయింది లక్ష్మినారాయణ వ్యవహారం. ఆ తర్వాత ఈయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి అంటూ ఉద్యోగానికి రాజీనామా చేసి కూడా బయటకు వచ్చారు. సొంత పార్టీ అని హడావుడి చేశారు. ఆ తర్వాత దివాళా దశలో ఉన్న లోక్ సత్తాను టేకోవర్ అని అన్నారు.


జేడీ లక్ష్మి నారాయణ నీ నీతి, నిజాయతీ ఏమైంది ..!

అవన్నీ కాదు.. ఇప్పుడు సూటిగా సుత్తిలేకుండా.. తెలుగుదేశం పార్టీలోకి చేరబోతున్నారట. ఈ విషయాన్ని తెలుగుదేశం అనుకూల మీడియానే ధ్రువీకరిస్తూ ఉంది. ఈయన పోటీకి నియోజకవర్గం కూడా రెడీ అయ్యిందట. ఇప్పటికే గంటా శ్రీనివాసరావుతో సమావేశం అయ్యారట ఈ మాజీ జేడీ. భీమిలి నుంచి లోకేష్ పోటీచేయడం లేదని.. అక్కడ నుంచి లక్ష్మినారాయణను పోటీ చేయించాలని అనుకుంటున్నారట. అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు. కానీ నిజంగా జేడీ .. టీడీపీ పార్టీ లో చేరితే ఇన్నాళ్లు అధికారిగా సంపాదించిన పేరును చెడకొట్టుకున్నట్టు అవుతుంది. కెరీర్ లో మాయని మచ్చగా మిగిలిపోతుంది. ఎందుకంటే టీడీపీలో చేరినట్లైతే..  జగన్ మీద జేడీ మోపిన కేసులు టీడీపీతో మ్యాచ్ ఫిక్సింగ్ వల్లే అని చాలా మంది భావిస్తారు. దీనితో తటస్థ ఓట్లు జగన్ వైపు మళ్లే అవకాశం లేకపోలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: