కొద్దిరోజుల్లో నామినేషన్ల ప్రక్రియ పెట్టుకొని ప్రధాన పార్టీలలోని నేతలు అటు వారు ఇటు, ఇటు వారు అటు తెగ జంపింగులు చేస్తున్నారు. దాదాపు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నేతలు కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. అయితే ఈ ఎన్నికల్లో దాదాపుగా వలస పక్షులు అంతా తెదేపా నుండి వైసీపీ గూటికి చేరుకున్నవే.


ఈ జాబితాలో తాజాగా చేరిన పేరు నరసరావు పేట ఎంపీ రాయపాటి సాంబశివరావు.
ఈయన మరొకసారి అదే చోటు నుండి ఎంపీ టికెట్ తో పాటు తన కుమారుడికి సత్తెనపల్లి ఎమ్మెల్యే టిక్కెట్ ను ఆశించారు. అయితే పరిణామాలు అతను ఊహించినంత ఆశాజనకంగా లేవు. చాలా రోజుల ముందే బాబుకి ఈ విషయాన్ని విన్నవించిన రాయపాటి అతని నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇక లాభం లేదనుకున్నట్లు ఉన్నాడు.
Image result for rayapati sambasiva rao

ఈ అసహనంతో ఆయన తెలుగుదేశం పార్టీని వీడేందుకు కూడా రెడీగా ఉన్నారని సమాచారం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తనకు పరిచయాలు పుష్కలంగా ఉన్నాయని, తనకి ఎలాంటి విషయం తేలకపోతే తన బాట ఆ వైపే అని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాడట. 
అయితే పార్టీ వీడే మునుపు చివరి సారిగా బాబుతో భేటీ అయ్యేందుకు అతను నేరుగా ఆయన ఇంటికే వెళ్లేందుకు సమాయత్తమయ్యారు. దాదాపు ఆయన వైసీపీలో చేరేందుకు ఏర్పాట్లు మొత్తం పూర్తయినట్లు సమాచారం.
Related image

కోరినట్టుగా ఆ సమావేశంలో నరసరావుపేట ఎంపీ - సత్తెనపల్లి అసెంబ్లీ టికెట్ లభించకపోతే తెలుగుదేశం పార్టీని రాయపాటి వీడటం మాత్రం ఖాయమని ప్రచారం జరుగుతూ ఉంది. ఇక ఆయన రాజీనామా చేసి వైసీపీలో చేరడం దాదాపు ఖాయమని అందరూ అనుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: