రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వస్తాడని ప్రచారం జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి విషయంలో భారీ కుట్ర జరిగింది. తన ఓటును తీసేయమంటూ జగన్మోహన్ రెడ్డి పేరుతో ఎన్నికల కమీషన్ కు ఫారం 7 అందంది. గుర్తు తెలీని వాళ్ళెవరో ఆన్ లైన్లో దరఖాస్తు చేశారు.  ఫారం 7 ఈనెల 9వ తేదీన దరఖాస్తు చేస్తే అది ఇపుడు బయటపడింది. ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఓటును తీసేసేందుకు ఫారం 7 దరఖాస్తు అందిందంటే వైసిపిపై ఏ స్ధాయిలో కుట్ర జరుగుతోందో అర్ధమైపోతోంది.

 

గతంలో ఎన్నడూ లేనివిధంగా ఓట్ల తొలగింపు కోసం ఫారం 7 దరఖాస్తు లక్షల్లో అందటం బహుశా దేశం మొత్తం మీద ఏపిలోనే  మొదటిసారేమో ? ఇదే విషయమై అధికార టిడిపి, ప్రధాన ప్రతిపక్షం వైసిపి మధ్య ఫిర్యాదుల పర్వం జరుగుతున్న విషయం తెలిసిందే.

 

వైసిపి సానుభూతిపరుల ఓట్లను తీసేస్తున్నారంటూ జగన్ అండ్ కో చంద్రబాబునాయుడు మీద తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబు అండ్ కో వైసిపి నేతల మీద ఎదురుదాడి చేస్తున్నారు. రెండు పార్టీలు ఒకదానిపై మరొక పార్టీ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేసుకోవటమే కాకుండా చీఫ్ ఎన్నికల కమీషన్ ను కలిసి ఫిర్యాదులు చేసుకున్నారు.

 

తాజాగా జగన్ ఓటును కూడా తొలగించమంటూ దరఖాస్తు అందటమంటే కుట్రకు పరాకాష్ట అనే చెప్పాలి. అంటే రేపటి ఎన్నికల్లో జగన్ ను పోటీకే అనర్హుడిని చేసేందుకు ప్రత్యర్దులు కుట్ర పన్నినట్లు స్పష్టంగా అర్ధమవుతోంది. మొత్తం మీద తన ఓటు తీసేయమంటూ జగన్మోహన్ రెడ్డి పేరుతో ఎన్నికల కమీషన్ కు ఫారం 7 అందటం సంచలనంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: