వేసవిలో ఎండల లాగే మంత్రాలయం నియోజకవర్గం ఎన్నికలు వేడివేడిగా సాగనున్నాయి. 2009లో తెలుగుదేశం నుంచి పోటీ చేసి విజయం సాధించిన వై.బాలనాగిరెడ్డి పార్టీలో విభేదాలు వచ్చి తెలుగుదేశం పార్టీని వీడి 2014లో వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసి  విజయం సాధించారు. ఇక్కడ ప్రజల మొగ్గు చూపు అంత బాల నాగిరెడ్డి వైపే ఉంది . ఇక తెలుగుదేశం నుంచి తిక్కా రెడ్డి పోటీ చేస్తున్నారు. చివరి ఎన్నికల్లో ఇద్దరి మధ్య హోరాహోరీ పోటీ సాగిందని చెప్పాలి. ఎందుకంటే చాలా తక్కువ మెజార్టీతో బాల నాగిరెడ్డి విజయం పొందారు. కేవలం ఏడు వేల ఓట్లతో విజయం సాధించారు అంటే అక్కడ ఎంత గట్టి పోటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం బాల నాగిరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీలో పార్టీలో కొనసాగుతూ పార్టీ సిద్ధాంతాలను అభివృద్ధి పథకాలను ప్రజల్లో బలంగా తీసుకెళుతూ తన బలాన్ని పెంచుకుంటున్నారు. మంత్రాలయంలో అభివృద్ధి  అంతంతమాత్రంగానే ఉందని వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి వరుసగా రెండుసార్లు విజయం సాధించిన బాల నాగిరెడ్డి  ఈ సారి కూడా కూడా విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు . ఇలాంటి గట్టి పోటీ  మధ్య విజయం సాధించాలంటే కొంతమేరకు శ్రమపడాల్సి ఉంటుంది ఉంటుంది. ఏది ఏమైనా వైసీపీ వైపే ప్రజలు ఆసక్తిగా ఉన్నట్లు కనిపిస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: