కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో లో ఈ సారి ఎన్నికల్లో పోరు రసవత్తరంగా సాగనుంది. ఇక్కడ ఆధిపత్యం బి వి జయ నాగేశ్వర్రెడ్డి ఉన్నట్లు కనిపించినా చెన్నకేశవరెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి  హవా కూడా బాగానే ఉందనే చెప్పాలి. అప్పట్లో తెలుగుదేశం తరఫునుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యే గా ఉన్న బివి మోహన్ రెడ్డిని గద్దె దించి  కాంగ్రెస్ తరఫునుంచి పోటీ చేసిన చెన్నకేశవరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడైనా వైఎస్సార్సీపీ  తీర్థం పుచ్చుకుని ఆయన కుమారుని బరిలో దింపారు. గత సారి ఎన్నికల్లో ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో గట్టెక్కిన జయ నాగేశ్వర్ రెడ్డి కి ఈసారి  గట్టిపోటీని ఇవ్వబోతున్నారు. తనదైన శైలిలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళుతున్న జయ నాగేశ్వర్రెడ్డి కే ఈసారి ప్రజలు పట్టం కట్టినట్లుగా అనిపించినా ఎంతో రాజకీయ అనుభవం ఉన్న చెన్నకేశవరెడ్డిని కూడా  తక్కువ అంచనా వేయలేం. కాబట్టి ఈ సారి ఎన్నికల్లో సారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సిపి పార్టీ గట్టిపోటీ ఇస్తుందని చెప్పవచ్చు. మిగతా పార్టీలు కూడా పోటీ చేసినా, వీళ్ళ హవా ముందు వెలవెలబోతాయి. ఏది ఏమైనా నా ఈ రెండు పార్టీలు సమవుజ్జీలుగా ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రజలు  ఏమి  నిర్ణయిస్తారు అనేది వేచి చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: