ప్రస్తుతం వైసీపీ హవా నడుస్తున్న ఆదోని నియోజకవర్గం లో ఈసారి కూడా అదే జండా ఎగురవేయాలని  వైసీపీ అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డి గట్టి నమ్మకంతో ఉన్నారు. అటువైపు టిడిపి అభ్యర్థి మీనాక్షి నాయుడు నీ కూడా తక్కువ అంచనా వేయలేం. ఆయన గతంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటుకున్నారు. 2009లో కాంగ్రెస్ తరఫునుంచి పోటీ చేసిన సాయి ప్రసాద్ రెడ్డి  ఓటమిపాలయ్యారు గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలుపొంది ఇప్పుడు అదే పార్టీలో కొనసాగుతూ మళ్లీ ఎమ్మెల్యే టికెట్ ను దక్కించుకున్నారు. ఆదోని అభివృద్ధి చేయడంలో విఫలం అయ్యారని సాయి ప్రసాద్ రెడ్డి పై అభియోగాలు వస్తున్నప్పటికీ వాటన్నింటినీ పెడచెవిన పెట్టి  ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళి పోతున్నారు. ప్రధానంగా గా ఆదోనిలో నీటి సమస్య ఒక కొలిక్కి రావట్లేదు .దీనిపై దృష్టి సారించిన వారికి అక్కడి ప్రజలు పట్టం కట్టేటట్లు కనిపిస్తున్నారు. మరి దీనిపై అక్కడి నాయకులు ఏలాంటి వ్యూహాలను రచించి ప్రజలను ఆకర్షిస్తారు చూడాలి మరి. అయితే ఈసారి  ఇద్దరు అభ్యర్థుల మధ్య పోటీ మాత్రం హోరాహోరీగా సాగుతుందని చెప్పవచ్చు. ప్రజలు మాత్రం వైసిపి అభ్యర్థి వైపే మొగ్గు చూపుతారని అక్కడి వారి మాట.


మరింత సమాచారం తెలుసుకోండి: