విశాఖనగరం అందమైనది. అమాయకమైనది కూడా. ఇక్కడ ప్రజలు ప్రశాంత జీవనం కోరుకుంటారు. అందరినీ  సమాదరించే గుణం కూడా విశాఖవాసులకు ఉంది. అదే ఇపుడు ఓ విధంగా శాపంగా కూడా మారుతోంది. విశాఖ అభివ్రుద్ధి విషయంలో వివక్ష, పక్షపాతం ఎపుడూ కొనసాగుతూ వస్తోంది. కానీ ఇక్కడ నుంచే సీట్లు, ఓట్లూ నేతలకు, పార్టీలకు కావాలి. అదే చిత్రం మరి.


విశాఖలో నాన్ లోకల్ ఎక్కువైపోతున్నారు. గత ముప్పయ్యేళ్ళుగా మెల్లగా ప్రారంభమైన ఈ విన్యాసం ఇపుడు పీక్స్ చేరుకుంది. ఇప్పటికే టీ సుబ్బరామిరెడ్డి. నేదురుమల్లి జనార్ధనరెడ్డి, పురంధేశ్వరి,  కంభంపాటి హరిబాబు వంటి వారిని ఎంపీలుగా చేసి  వలస పాలనక విశాఖ ఘన స్వాగతం పలికింది. అలాగే విశాఖలో ఎమ్మెల్యేలు కూడా నాన్ లోకలే ఎక్కువమంది  ఉన్నారు. వారే వెలగపూడి రామక్రిషణబాబు, పంచకర్ల రమేష్ బాబు, అవంతి శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు. ఇపుడు వీరికి అదనంగా మరింతమంది కొత్త వారు విశాఖ మీదకు దండెత్తుస్తున్నారు.


జనసేనాని పవన్ కళ్యాణ్ విశాఖలోని గాజువాక నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. ముఖ్యమంత్రి పుత్ర రత్నం మంత్రి, నారా లోకేష్ విశాఖ ఉత్తరం నుంచి పోటీకి దిగిపోతున్నారు. భీమిలీ నుంచి మాజీ జేడీ లక్ష్మీ  నారాయణ కూడా తయార్ అంటున్నారు. మరింతమంది  కూడా ఈ వైపుగా చూస్తున్నారు. అందరూ బయటవారే అయితే విశాఖ సంగతేంటని లొకల్ నాయకులు ఇపుడు మండిపోతున్నారు. విశాఖ కెరాఫ్ నాన్ లోకల్ అంటున్నారు ఇపుడు. లోకల్ నినాదం ఇపుడు బలపడితే మాత్రం ఎంతటి పెద్ద నాయకులైనా ఓడిపోకతప్పదని కూడా హెచ్చరిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: