ఏపీలో లగడపాటి సర్వేలకు నిన్నటి వరకూ మంచి డిమాండ్ ఉండేది. ఎపుడైతే తెలంగాణాలో అది ఆడ్డం తిరిగిందో ఆయన్ని నమ్మిన  వారు కూడా మానేశారు. ఇక ఆయన తరచూ ఓ రాజకీయ పార్టీలో రాసుకుపూసుకుతిరగడం వల్ల కూడా ఆయన మీద విశ్వసనీయత తగ్గుతోంది. అయినా సరే ఆయన తన సర్వేల ఉత్సాహాం ఆపుకోలేకపోతున్నారు. తన సర్వేల ద్వారా ఓ పార్టీకి  రాజకీయ లాభాన్ని పంచాలన్న ఆరాటం కూడా వదులుకోలేకపోతున్నారు.


విషయానికి వస్తే లగడపాటి వారు లేటెస్ట్ గా కొన్ని కామెంట్స్ చేశారు. ఏపీలో హోరా హోరీ తప్పదట. టీడీపీ, వైసెపీలతో పాటు జనసేనను కూడా ఆయన లెక్కలోని తీసుకున్నారు. ఈ మూడు పార్టీల మధ్య గట్టిగా ఫైట్ ఉంటుందని చెప్పకనే చెప్పేశారు. అయితే ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయి మూడు రోజులే అయినందువల్ల ఇంకా వ్యవహారం ఓ కొలిక్కి రాలేదట. ఇక ఏపీలో జనం ఈసారి హంగ్ ఇవ్వరని కూడా లగడపాటి చెప్పేస్తున్నారు. త్రిముఖ పోరు ఉన్నా కూడా ఏకపక్షమైన తీర్పు వస్తుందని చెబుతున్నారు.


అభివ్రుధ్ధి చేసిన వారికే జనం ఓటు వేస్తారని చెప్పడం ద్వారా లగడపాటి ఇండైరెక్ట్ గా టీడీపీకే జనం మొగ్గు అని చెప్పకనే చెబుతున్నారన్నమాట. ఓ వైపు టీడీపీలోకి పాత కాపులను చేర్చే పనిలో యమ బిజీగా ఉన్న ఈ మాజీ ఎంపీ సైకిల్ పార్టీ గెలుస్తుందని చెప్పకుండా మరే పార్టీ గురించి చెబుతారని కూడా సెటైర్లు పడుతున్నాయి. తాను రాజకీయ సన్యాసం చేశానని అంటున్న లగడపాటి వారు టీడీపీ శిబిరంలో హడావుడి చేయడాన్ని ఏమనుకోవాలో కూడా  ఆయనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: