ఎన్నికలు వస్తున్నాయంటే చాలు డబ్బు విరివిగా పట్టుపడుతుంటాయి.  అభ్యర్థులు ఓట్లను కొనడానికి రక రకాలుగా జిమ్మిక్కులు చేస్తుంటారు..అందుకోసం విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతుంటారు.  ఓ వైపు ఎలక్షన్ కమీషన్ అభ్యర్థి ఇంతే ఖర్చు పెట్టాలని రూల్ పెట్టినా..అవి బేఖాతరు చేస్తూ డబ్బులు వెదజల్లుతుంటారు.  ఇక ఓటరు సైతం ఏ పార్టీ అభ్యర్థి ఎంత ఇచ్చాడన్న ఆలోచనలోనే ఉంటారు..కానీ భవిష్యత్ లో ఆ నాయకుడు తమను సరిగా పాలిస్తాడా లేదా అన్న విషయాన్ని మర్చిపోతుంటారు.  ప్రతి ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపట్టినా..ఓటర్ల తీరు మాత్రం మారదు.  ఇక ఎన్నికల షెడ్యూల్ ఇలా విడుదలైందో లేదో... అప్పుడే ఏపీలో నోట్ల కట్టలు బయట పడుతున్నాయి.
హవాలా డబ్బు.. 90 లక్షలు సీజ్
పలు ప్రాంతాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసిన పోలీసులు విస్తృతంగా తనిఖీలను చేస్తుండగా, అక్రమంగా తరలిస్తున్న డబ్బు పట్టుబడుతుంది. హైదరాబాద్‌ నగర పోలీసులు చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో రూ.90 లక్షల50  హవాలా డబ్బు పట్టుబడింది. కంచన్‌బాగ్, సుల్తాన్‌బజార్‌ ప్రాంతాల్లో నాలుగు బైక్‌లపై అక్రమంగా డబ్బు రవాణా చేస్తున్న నలుగురిని ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేసి భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. కెట్ లో డబ్బులు పెట్టుకుని నలుగురు హవాలా వ్యాపారులు పట్టుపడ్డారు.

లెక్క చూపని డబ్బు ఉన్నట్లు గుర్తించి నలుగురిని అరెస్ట్ చేసి 90 లక్షల 50 వేలు సీజ్ చేశారు.ఎలక్షన్ కమిషన్ గైడెలెన్స్ ప్రకారం ఆన్ అకౌంట్ మనీని సీజ్ చేసాం. తదుపరి విచారణకు ఆదాయ పన్ను శాఖకి అప్పగిస్తాం' అని సీపీ అంజనీకుమార్ తెలిపారు.   గురజాల నియోజకవర్గంలో వజ్రాల పెద్ద అంబిరెడ్డి అనే వ్యక్తి వద్ద రూ. 4.40 లక్షలు, మంగళగిరి, ఆర్‌ అండ్ బీ బంగ్లా వద్ద వేర్వేరు కార్లలో తరలిస్తున్న రూ. 82 లక్షలు, సుంకర శ్రీనివాసరావు అనే వ్యక్తి నుంచి రూ. 70.72 లక్షలు, మహీధర్‌ అనే వ్యక్తి నుంచి రూ. 12 లక్షలు పట్టుబడ్డాయి.

గుంటూరు జిల్లా శివార్లలో రూ. 1,43 కోట్లు, మంగళగిరిలో రూ. 82 లక్షలు, ఉండిలో రూ. 63 లక్షలు, తెనాలిలో రూ. 2.50 లక్షలు డబ్బు తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. శనక్కాయల ఫ్యాక్టరీ సెంటర్‌ లో సమీపంలో సుబ్బారెడ్డి అనే యువకుడి నుంచి రూ. 22 లక్షలు, పలకలూరు రోడ్డులో రూ. 4 లక్షలు పోలీసులకు పట్టుబడ్డాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: