వైసీపీ అధినేత జగన్  ఈ రోజు తొలి జాబితా విడుదల చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే చాలా చోట్ల అభ్యర్ధులను ఎంపిక చేసి పెట్టుకున జగన్ వివాదాలు లేని సీట్లలో అభ్యర్ధులను అనధికారికంగా ప్రచారం చేసుకొమ్మని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇపుడు వారి జాబితాను జగన్ ప్రకటిస్తారని అంటున్నారు. తొలి జాబితాలో ఉత్తరాంధ్ర అభ్యర్ధులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.


జగన్ ప్రకటించే తొలి జాబితాలో 75 మంచి అభ్యర్ధుల పేర్లు  ఉన్నాయని అంటున్నారు.అందులో  శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి కూడా ఎక్కువమందికి చోటు ఉందని అంటున్నారు. ఈ జిల్లాలో వైసీపీ తొమ్మిది సీట్లలోనే గతంలో  గెలిచింది. అందులో నలుగురు ఎమ్మెల్యెలు ఫిరాయించారు. మిగిలిన అయిదుగురికి టికెట్లు ఈసారి ఖాయం. అదే విధంగా అనేక చోట్ల  సమర్ధులు, పాతవారు ఉన్నారు. బొత్స, ధర్మాన, తమ్మినేని సీతారాం వంటి వారు జగన్ తొలి జాబితాలో ఉండే అవకాశం ఉంది.


ఇక విశాఖ జిల్లాలో మాత్రం తొలి విడతలో ఎక్కువ మంది పేర్లు ఉండకపోవచ్చునని అంటున్నారు. ఇక్కడ చూసుకుంటే టీడీపీకి సాటిగా బలమైన అభ్యర్ధుల కోసం ఇంకా ఎంపిక సాగుతూనే ఉంది అంటున్నారు. మరో వైపు టీడీపీలో బిగ్ షాట్స్ విశాఖ మీద కన్ను వేయడం, జనసేనాని కూడా ఇక్కడ నుంచే పోటీ చేయానుకోవడంతో వైసీపీ జాబితాలో మార్పు చేర్పులు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: