ఏపీలో రాజకీయాన్ని తలపండిన నేతలు సులువుగానే అంచనా వేస్తున్నారు. అయితే పరిస్థితులను మార్చేయగల నైపుణ్యం కూడా ఏపీలో రాజకీయ ఉద్దండ పిండాలకు చాలానే ఉంది. ఏపీలో గతసారి ఎన్నికలే ఇందుకు నిదర్శనం. ఇంతకు ముందు ఓ పార్టీకి వేవ్ ఉంది అంటే కచ్చితంగా గెలిచేది. ఇపుడు  అలా కాదు, సోష‌ల్ మీడియా ప్రభావంతో క్షణాల్లో అంతా తారు మారు అవుతోంది.


విషయానికి వస్తే సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీలో రాజకీయ ముఖ చిత్రాన్ని బాగానే విశ్లేషించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చేసిన కొన్ని కామెంట్స్ బట్టి చూస్తే ఏపీలో గాలి ఇపుడు వైసీపీ వైపుగా ఉందని చెప్పారు. జగన్ కి పాదయాత్ర బాగా కలసివస్తోందని కూడా వుండవల్లి అంచనా కట్టారు. అదే సమయంలో మోడీతో జగన్ కి లింక్ పెట్టడం వల్ల నష్టం ఏమీ జరగదని, లాభమే ఉంటుందని కూడా చెప్పుకొచ్చారు.


అయితే పోలింగ్ కి ఇంకా నెల రోజుల సమయం ఉన్నందుక పరిస్తితులు మార్చేయగల చాణక్యం చంద్రబాబుకు ఉందని ఉండవల్లి ఊహిస్తున్నారు. అందువల్ల జగన్ ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. అదే విధంగా జనసేన ప్రభావం కూడా ఇపుడే చెప్పలేమని, పవన్ సభలకు జనం విరగబడి వస్తున్నారని, మరి అది ఎంతవరకూ ఓట్ల రూపం సంతరించుకుంటుందో చూడాలని అన్నారు. మొత్తానికి ఈ మాజీ ఎంపీ మాటలను బట్టి ఏపీలో వైసీపీ వేవ్ గట్టిగానే ఉందని అర్ధమవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: