వచ్చే ఎన్నికల్లో పాతిక్కి పాతికా ఎంపీ సీట్లు గెలుచుకుంటామని చెప్పుకొచ్చిన అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైసీపీలకు అసలైన అగ్ని పరీక్ష ఇపుడు ఎదురవుతోంది. ఓ వైపు చూస్తే పోలింగుకు  టైం బాగా తక్కువ ఉంది  ఏడు అసెంబ్లీ సెగ్మంట్లో ఎంపీలు తిరగాల్సి ఉంది. సమయం అసలు సరిపోదు. కచ్చితంగా టైం మూడు వారాలే ఉంది.


మరో  వైపు చూస్తే ఎక్కడా ఎంపీ అభ్యర్ధులు రెండు పార్టీలకు కూడా కుదరడంలేదు అంటున్నారు. ఉత్తరాంధ్రలో చూసుకుంటే విశాఖ లాంటి సీట్లో టీడీపీ, వైసీపీలకు సమర్ధులైన అభ్యర్ధులు లేరు.  వైసీపీ ఎంవీవీ సత్యనారాయణ అంటోంది కానీ ఆయన పెద్దగా  లాగలేరని భావన ఉంది. టీడీపీ మంత్రి గంటా శ్రీనివాసరావు అంటోంది. కానీ ఆయన ఇష్టపడడంలేదు. ఇక అనకాపల్లి ఎంపీ సీటు కూడా రెండు పార్టీలకు సవాల్ గా మారింది. ఇప్పటికి ఎవరన్నది తెలియదు. విజయనగరంలో వైసీపీకి బొత్స ఝాన్సీ ఉంటే టీడీపీలో ఇంకా ఎవరన్నది తేలలేదు.


అలాగే శ్రికాకుళం, అరకు సీట్లలో వైసీపీలో ఎవరు ఎంపీ అభర్ధి అన్నది ఇప్పటికి తేల్చలేదు. దాంతో ఆ పార్టీలోని ఆశావహులు కలవరపడుతున్నారు. రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలను తీసుకున్నాయి. దాంతో ధీటైన అభ్యర్ధుల పేరిట విపరీతమైన జాప్యం అవుతోంది. రేపటి ఎన్నికల్లో ఇది ఇబ్బంది అవుతుందేమోనని క్యాడర్ అంటోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: