ఇప్పుడు ఆంధ్రాలో వైసీపీ జోరు కొనసాగుతోంది. అన్ని చేరికలూ వైసీపీలోకే ఉంటున్నాయి. ఈసారి అధికారంలోకి రావడం ఖాయం అని జగన్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అదికారం మాదే అంటూ ప్రైవేటు సంభాషణల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ చూపిస్తున్నారు. 

అంతే కాదు. కొన్ని పథకాలు, హామీల విషయంలో కూడా ఇప్పటి నుంచే జాగ్రత్తపడుతున్నారట. అయితే ఈ విషయంలో జగన్ గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటి ఉంది. గత ఎన్నకల ముందు కూడా ఇలాగే జరిగింది. రుణమాఫీ హామీ జగన్ను అధికారానికి దూరం చేసింది. 



ఇంకో విషయం ప్రత్యర్థి చంద్రబాబును జగన్ తక్కువు అంచనా వేయకూడదు. రాజకీయాల్లో చాణక్యుడు చంద్రబాబు అన్న పేరు ఉంది. చివరి నిమిషం వరకూ ఆయన వ్యూహాలు పన్నుతూనే ఉంటారు. ఆయనఎప్పుడు ఏమైనా చేయొచ్చు.

ఇప్పటికే ఆయన జగన్ - కేసీఆర్ బంధంపై బాగానే దుష్ప్రచారం చేస్తున్నారు. జగన్ అధికారంలోకి వస్తే కేసీఆర్ రాజ్యం వస్తుందని చెబుతున్నారు. ఇది ప్రజలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందుకే.. జగన్‌ జర భద్రం. 



మరింత సమాచారం తెలుసుకోండి: