సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. ఏప్రిల్ 11న ఆంధ్ర ప్రదేశ్ లో లోక్ సభ తో పాటు శాసనసభ ఎన్నికలు ఒకే ఒక విడతలో జరగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ఇలా విడుదలైన వెనువెంటనే ముఖ్య రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. తోలుతగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తన ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన రెడ్డిలను లక్ష్యంగా చేసుకుని విమర్శల నిప్పుల వర్షం కురిపించారు.


కర్నూలు జిల్లాలో ఒక సభలో మాట్లాడిన చంద్రబాబు వైసీపీకి పెట్టుబడి పెట్టి ఎగదోయడమే తానిచ్చే రిటర్న్ గిఫ్ట్ అని కేసీఆర్ భావిస్తున్నారని, కానీ తాను జగన్మోహన రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించి ఆ ఓటమిని కేసీఆర్ కు రిటర్న్ గిఫ్ట్ గా పంపిస్తానని చంద్రబాబు భీషణ ప్రతిజ్ఞ చేశారు.

 

రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం ఎలాగా? అని తాను ఆలోచిస్తుంటే, జగన్ మాత్రం లోటస్ పాండ్ లో కూర్చుని కొత్త కుట్రలకు తెరలేపుతుంటారని నారా చంద్ర బాబు నాయుడు విమర్శించారు. వైసీపీ అధ్యక్షుడికి దమ్ముంటే ఏపీలో అడుగుపెట్టి టీడీపీ తో తలపడాలని సవాల్ విసిరారు. “ఢిల్లీ మోదీ (నరేంద్ర మోదీ), హైదరాబాద్ మోదీ (కేసీఆర్), లోటస్ పాండ్ మోదీ (జగన్) ముగ్గురూ ఏపీ అభివృద్ధిని చూసి అసూయతో రగిలిపోతూ ఏ విధంగానైనా మనల్ని వెనక్కిలాగాలని ప్రయత్ని స్తున్నారు. వాళ్లని ఎంత మాత్రం ఉపేక్షించను” అంటూ చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


“ప్రత్యేక హోదా” వచ్చేలా చేయమని కేసీఆర్ ను వైఎస్ జగన్మోహన రెడ్డి  ఒప్పించాలని, కేంద్రానికి లేఖ రాయమని జగన్ చెప్పాలని సీఎం చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో మళ్లీ ఆంధ్రా వాళ్ల పాలన కావాలా? అని కేసీఆర్ అడిగారని - మరి, ఇప్పుడు తాను కూడా ప్రశ్నిస్తు న్నానని, ఏపీలో తెలంగాణ వాళ్ల పాలన కావాలా? అని ధ్వజమెత్తారు. ‘మీకు చంద్రబాబు కావాలా? కేసీఆర్ కావాలా?  టీఆర్ఎస్ కు ఊడిగం చేసే జగన్ కు ఓటేయాలా?’ అని ప్రశ్నించారు.
Image result for kcr modi jagan will show real game to chandrababu now 
రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించేవారికి, యువత భవిష్యత్తుకు ఈ ఎన్నికలు చాలా ముఖ్యమని చంద్రబాబు అన్నారు. చదువుకున్న పిల్లలు, యువత విజ్ఞతతో ఆలోచించాలని, ఏ ప్రభుత్వం? ఏ పార్టీ? భరోసా ఇస్తుందో, దానికి అండగా ఉండాలని, ఈ ఎన్నికలు ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని స్పష్టం చేశారు.


ప్రజలేమంటున్నారంటే: 

*తెలంగాణా ఎన్నికల్లో వేలుపెట్టి గెలికింది మీరేకదా!  తరవాత తెలంగాణా బంగారు కుటుంబం “నా పుట్టలో వేలుపెడితే నేను కుట్టనా?” అంటూ "తిరుగు బహుమతి" return gifts యివ్వటం మొదలెట్టారు.
 

*జగన్ లక్షలకోట్లు దోపిడీ చేశారని చంద్రబాబు టిడిపి బృందం అంటుంది కదా! అలాంటప్పుడు జగన్ కు కెసీఆర్ ఇచ్చే వెయ్యికోట్లు ఏమూలకు?  ప్రశ్నిస్తున్నారు అంతేకాదు తెలంగాణాలో కాంగ్రెస్ తో కోతి కొమ్మచ్చి ఆట కు వేలకోట్లు స్పాన్సర్ చేసింది మీరే కదా! మరి మీరెందుకు జగన్-కెసీఆర్ వైపు వెలు చూపిస్తారని అంటున్నారు జనం 
 

*ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజి కోరింది మీరే కదా! అలాటప్పుడు ప్రత్యేక హోదా విషయంలో జగన్ దూకుడు తట్టుకోలేకే మీరు యూటర్న్ తీసుకున్న మీ చరిత్ర ఎవరికి తెలియదు? అంటున్నారు.
 Image result for chandrababu has taken oath to defeat jagan
*ఆంధ్రప్రదేశ్ లో మీ అసెంబ్లీ రౌడీ ఎమెల్యెలు చింతమనేని లాంటివాళ్ళ పాలన చూశాక జనం “ఈ అసుర పాలన అంతమయ్యెదెప్పుడు?” అంటున్నారు. ఈ నెల గడిస్తే చాలు అంటూ ఈ దుర్మార్గ పాలన అంతానికి ఓటు ఆయుధం మీకు వ్యతిరేఖంగా వేయటానికి సిద్ధంగా ఉన్నారు.
 

*మీ గెలుపుపై ఒక సారి తెలంగాణాలో లాగే "ఆంధ్ర ఆక్టోపస్" తో సర్వే చేయించండి – మీ కీర్తి దిగంతాలకు చేరువౌతుందని జనం అనుకుంటున్నారు.
 

*మీరు జన రాజకీయ సామాజిక ఆర్దిక సమాచారాన్నితస్కరించి ఐటీ గ్రిడ్స్ కు అందచేసిన తరవాత జనంలో మీరెంత పలచబడ్డారో రాత్రివేళల్లో మారువేషంలో వెళ్ళి సర్వే చేయించుకోండి లగడపాటితో-అది చూసుకొనైనా కాస్త మనశ్శాంతిగా ఉండొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: