చివరి నిముషంలో వైసిపి జాబితా వాయిదా పడింది. మొదటిజాబితా ఉదయం విడుదలవుతుందని జగన్ మీడియా కూడా ఉదయం నుండి విస్తృతంగా ప్రచారం కల్పించింది. అయితే చివరినిముషంలో మొదటి జాబితా ప్రకటనను వాయిదా వేశారు. తొలి జాబితాలో సుమారు 80 అసెంబ్లీ, 13 మంది లోక్ సభ అభ్యర్ధులతో జాబితా తయారైందని చెప్పారు.

 

జాబితా ప్రకటనకు వీలుగా ఉదయం నుండి జగన్మోహన్ రెడ్డి కూడా పార్టీ ముఖ్య నేతలతో చాలా బిజీగా గడిపారు. అదే సమయంలో వైసిపిలో చేరికలు కూడా ఊపందుకున్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వర ప్రసాద్, టిడిపి కాకినాడ ఎంపి తోట నర్సింహం, సినీనటుడు రాజా రవీంద్ర, విజయవాడ మాజీ మేయర్ రత్నబిందు తదితరులు వైసిపి కండువా కప్పుకున్నారు.

 

ఒకవైపు పార్టీలోని ముఖ్యులతో చర్చలు మరోవైపు పార్టీలో చేరికలతో జగన్ కు సమయం సరిపోలేదు. అంతేకాకుండా  టిడిపిలో నుండి మరింకొందరు ముఖ్యనేతలు వైసిపిలోకి రావచ్చన్న సంకేతాలు అందటంతో జాబితా ప్రకటనను వాయిదా వేసినట్లు సమాచారం. ఒకసారి జాబితాను ప్రకటించేసిన తర్వాత అదే స్ధానంలో ఇంకెవరైనా ముఖ్యులు వచ్చి చేరితే అభ్యర్ధిని మార్చటం సాధ్యం కాదని జగన్ భావించారట. అందుకనే మొదటిజాబితా వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. ఈనెల 16వ తేదీ ఉదయం 10.26 గంటలకు ఇపుపులపాయలో జాబితాను విడుదల వేయాలని జగన్ నిర్ణయించారు. అదే రోజు ప్రచారం కూడా మొదలుపెట్టేస్తారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: