రాబోయే ఎన్నికల్లో హోం శాఖమంత్రి నిమ్మకాయల విజయం అంత ఈజీ కాదని తెలుస్తోంది. మొన్నటి వరకూ తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం అసెంబ్లీకి నిమ్మకాయల టిడిపి తరపున గట్టి అభ్యర్ధనే ప్రచారం ఉండేది. కానీ హఠాత్తుగా టిడిపికి రాజీనామా చేసి వైసిపిలో చేరిన కాకినాడ ఎంపి తోట నర్సింహం భార్య తోట వాణికి జగన్మోహన్ రెడ్డి పెద్దాపురం టికెట్ కేటాయించారట. దాంతో హోం శాఖమంత్రిలో టెన్షన్ మొదలైంది.

 

మొన్నటి వరకూ వైసిపి తరపున దవులూరి దొరబాబు పోటీ చేస్తారని అనుకున్నారు. అయితే ఏ విధంగా చూసినా సుబ్బారావుకన్నా తోట వాణినే పవర్ ఫుల్లు. పైగా నిమ్మకాయల, వాణి ఇద్దరు కూడా కాపులే. ఇటు నిమ్మకాయల, అటు తోట నర్సింహం ఇద్దరికీ నియోజకవర్గంపై మంచి పట్టుంది. ఇద్దరు కూడా దశాబ్దాలుగా రాజకీయాల్లోనే ఉన్నారు. దాంతో నిమ్మకాయల గెలుపు అంత సులభం కాదని అర్ధమవుతోంది.

 

వైసిపి తరపున నియోజకవర్గంలో సమన్వయకర్తగా ఉన్న దవులూరి దొరబాబును కాకినాడ ఎంపిగా పోటీ చేయించాలని జగన్ ఆలోచిస్తున్నారట. అదే నిజమైతే అసెంబ్లీ అభ్యర్ధిగా వాణి గట్టి అభ్యర్ధే అవుతుంది. పైగా అన్నీ పరిస్ధితులు అనుకూలించిన పోయిన ఎన్నికల్లోనే నిమ్మకాలయకు వచ్చిన మెజారిటీ 10 వేలు. చంద్రబాబు పాలనపై జనాలు మండిపోతున్నారు.  ప్రధానంగా కాపులు, బిసిలు మంటమీదున్నారు. పాదయాత్రలో జగన్ కు జనాలు బ్రహ్మరథం పట్టింది నిజమే అయితే వాణి గెలుపు నల్లేరు మీద నడకనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: