ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మరియు తెలుగుదేశం పార్టీలో కీలకమైన లీడర్ అయినా పరిటాల రవీంద్ర మన అందరికీ సుపరిచితులే. అనంతపురం జిల్లా పెనుగొండ అ మాజీ శాసనసభ్యుడైన ఈయన 2005లో ప్రత్యర్థుల దాడిలో మరణించారు. అయితే ఎన్టీఆర్ మరియు చంద్రబాబు హయాంలోనే ఈయన చాలా బలమైన లీడర్ గా ఎదిగాడు. పూర్తి అనంతపురం జిల్లా నే తెలుగుదేశం పార్టీకి కంచుకోట గా మార్చేశాడు. 

ఇతని మరణం తర్వాతే కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తమ జెండా ఎగురవేయగలిగింది. ఇప్పుడు అతని తనయుడు పరిటాల శ్రీరామ్ కూడా తన తండ్రి బాటలోనే కొనసాగుతున్నట్లు అర్థమవుతోంది. ప్రస్తుతం అతని తల్లి పరిటాల సునీత రాప్తాడు నియోజకవర్గం కి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటువైపు కుమారుడు తన తండ్రి కాలంలో ఉన్న పూర్వ వైభవాన్ని తెలుగుదేశం పార్టీకి అనంతపురం జిల్లాలో తీసుకు వచ్చే దిశగా చాలావరకు సఫలం అయ్యాడు అనే చెప్పాలి. 

ఎంతలా అంటే ఆ జిల్లాలో వైసీపీ నుండి నిలబడేందుకు జగన్ క్యాండిడేట్ ల పేర్లను తడుముకునేంతలా. క్రితం సారి ఎన్నికల్లో టిడిపి అనంతపురంలో బాగానే రాణించినా, ఈసారి మాత్రం పరిటాల సాయంతో పూర్తిగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ను క్లీన్ స్వీప్ చేయాలని కృతనిశ్చయంతో ఉంది. ఇప్పుడు శ్రీ రామ్ కి జనాల్లో ఉండే ఆదరణ చూస్తుంటే వారికి పరిటాల రవి నే గుర్తుకు వస్తున్నారని రాజకీయ విశ్లేషకుల మాట. అతనికి టికెట్టు ఇచ్చినా ఇవ్వకపోయినా శ్రీరామ్ మాత్రం తన తండ్రిని తలపించేలా అనంతపురంలో టిడిపి విజయ బావుటా ఎగురవేసేందుకు తన సర్వ శక్తులొడ్డుతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: