ఒకే ఇంటి అల్లుళ్ళు అయినా ఇద్దరికీ మధ్య రాజకీయం రంజుగానే సాగుతోంది. లేట్ గా వచ్చిన లేటెస్ట్ పాలిటిక్స్ చేయడంలో చిన్నల్లుడు బాగానే రాణిస్తున్నారు. ఒక్క దెబ్బతో ఎట్నుంచి నరుక్కు రావాలో అలా నరుక్కు వచ్చేశారు. అంతే ఝలక్ ఇద్దామనుకున్న పెద్దల్లుడు చల్లగా జారుకోవాల్సివచ్చింది. విశాఖ టీడీపీలో ఇపుడు మూర్తి గారి మనవడు పొలిటికల్ షాట్ మామూలుగా లేదుగా. ఇద్దరు బాబులకూ చెక్ చెప్పి అనుకున్నది సాధించిన నాయకునిగా భరత్ అపుడే జిల్లా టీడీపీలో బిగ్ ఫిగర్ అయిపోయారు. నిజానికి ఎంత సీనియర్ నేతగా ఉన్నా ఎంవీవీఎస్ మూర్తి ఎపుడూ బాబుని ఇలా జడిపించిన దాఖలాలు లేవు.


కానీ బాబుకే షాక్ ఇచ్చేలా ఇపుడు బాలయ్య అల్లుడు శ్రీ భరత్ వేసిన ప్లాన్ కి ఏకంగా లోకేష్ విశాఖ నుంచి పోటీ విరమించుకోవాల్సివచ్చింది. మొదట్లో నయాన టికెట్ అడిగిన శ్రీ భరత్ కి బాబు వద్ద వర్కౌట్ కాలేదు సరికదా ఏకంగా ఆయన ఎంపీ టికెట్ కే చెక్ పెట్టేందుకు అన్నట్లుగా లోకెష్ విశాఖ పోటీకి సై అన్నారు.  దాంతో చిర్రెత్తుకొచ్చిన శ్రీ భరత్ బాబు మీద ఎవరిని ప్రయోగించాలో వారినే ప్రయోగించారు. ఏకంగా మామ బాలక్రిష్ణకే అల్టిమేటం ఇచ్చేశారు. తనకు ఎలా అయినా టికెట్ ఇవ్వాల్సిందేనంటూ శ్రీ భరత్ బాలయ్యకు గట్టిగా చెప్పేసరికి బాలయ్య మాత్రం ఏం చేస్తారు.


బాబు వద్దకు వెళ్ళి తన చిన్నల్లుడు టికెట్ అమీ తుమీ తేల్చమంటూ అల్టిమేటం జారీ చేశారట. దాంతో బాబు చేసేది లేక ఒకే చెప్పాల్సివచ్చిందట. ఇద్దరు అల్లుళ్ళూ ఒకే చోట టికెట్ ఇవ్వడం కుదరదు కాబట్టి లోకేష్ ని మంగళగిరికి షిఫ్ట్ చేసి మరీ శ్రీ భరత్ కి లైన్ క్లియర్ చేశారట. మొత్తానికి పొలిటికల్ ఎంట్రీ ముందే అదిరిపోయే ట్విస్టులు  ఇచ్చిన చిన్నల్లుడు ఇంక గెలిస్తే అటు టీడీపీలో ఎన్నెన్ని మెరుపులు మెరిపిస్తాడో.


మరింత సమాచారం తెలుసుకోండి: