జనసేనాని విశాఖ రూట్ పట్టారు. లేటెస్ట్ న్యూస్ ప్రకారం చూస్తే గాజువాక నుంచి పవన్ పోటీ చేస్తారట. రేపో నేడో ఆ పార్టీ విడుదల చేయబోయే జాబితాలో పవన్ పేరు గాజువాక నుంచి వుంటుందని చెబుతున్నారు. ఏపీలో ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రాంతమంటే తనకు చాలా మక్కువని, అక్కడే పోటీ చేస్తానని చెబుతూ వచ్చిన పవన్ ఇపుడు గాజువాకలో పోటీకి రెడీ అయ్యారని అంటున్నారు. అయితే ఇక్కడో ట్విస్ట్ కూడా ఉందిట. పవన్ ఒక్క గాజువాక నుంచే పోటీ చేయడం లేదని, తూర్పు గోదావరి జిల్లాలో మరో సీటు నుంచి కూడా పోటీ చేస్తారని కూడా టాక్ నడుస్తోంది.


గాజువాకలో పవన్ పోటీకి ఇపుడు అనుకూల వాతావర‌ణం ఉందా అంటే కొంత మేరకు ఫరవాలేదు అంటున్నారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది. అయన్ని మళ్ళీ పోటీకి పెద్దవద్దని తమ్ముళ్ళు వేడుకున్నా కూడా చంద్రబాబు మళ్ళీ ఆయన‌కే టికెట్ ఇచ్చారు. దాంతో పల్లా శ్రీనివాస్ ఓటమి ఖాయమన్న మాట వినవచ్చింది. అక్కడ మొదటి నుంచి వైసీపీ అభ్యర్ధి తిప్పల నాగిరెడ్డి పోటీ చేస్తూ గెలుపు కోసం   గట్టి ప్రయత్నాలు చేసుకుంటూ వస్తున్నారు. ఆయన గతసారి ఓడిపోవడంతో ఈసారి సానుభూతి ఒడ్డెక్కిస్తుందని కూడా భావిస్తున్నారు. సరిగ్గా ఈ టైంలో పవన్ పోటీ చేయడం ఇంటెరెస్టింగ్ మ్యాటరే.


సిట్టింగ్ ఎమ్మెల్యే సీటు చిరిగిపోతున్న గాజువాకలో పవన్ పోటీ అంటున్నారంటే ఇక్కడ టీడీపీతో ఏమైనా లోపాయికారిగా  అవగాహన ఉందా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఓ విధంగా పవన్ మీద పల్లా వీక్ క్యాండిడేట్ అవుతారని తెలిసి మరీ  పల్లాను పోటీకి పెట్టాలనుకోవడం అంటే పవన్ కోసమే ఇదంతానా అన్న మాట కూడా వినిపిస్తోంది. పైగా ఇక్కడ పవన్ సామాజికవర్గం కూడా బాగా ఉంది. అందులో నుంచి పోటీకి టీడీపీ నేతలు  ట్రై చేసినా టికెట్ ఇవ్వకుండా చేయ‌డంపైనా మతలబు ఏదైనా ఉందా అన్న డౌట్లూ వస్తున్నాయి. మొత్తానికి పవన్ కి తెరచాటు సహకారం బాగానే అందుతోందన్న అనుమానాలైతే  బాగానే ఉన్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: