ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరు లోని పుంగనూరు నియోజకవర్గం నుంచి బరిలోకి అనూష రెడ్డిని బరిలోకి దించనున్నారు. అలాగే వైయస్సార్సిపి పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి  రామచంద్రారెడ్డి తిరిగి పోటీ చేయనున్నారు. చంద్రబాబుకు పెద్దిరెడ్డి కుటుంబం కొరకరాని కొయ్య గా మారారు.

ఎందుకంటే పుంగనూరులో లో పెద్దిరెడ్డి కుటుంబానికి ఎదురే లేదు. అందుకే  చంద్రబాబు ఈ నియోజకవర్గంలో ఎలాగైనా గెలుపొందాలని కొన్ని నెలలుగా కసరత్తులు చేసి టిడిపి నుంచి పోటీ చేసి గెలుపొందిన అమర్నాథ్ రెడ్డి కి స్వయాన మరదలు అయిన  అనుష రెడ్డికి టికెట్ ఇవ్వడానికి మెుగ్గు చూపారు.

పెద్దిరెడ్డి రెండు సార్లు సార్లు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆ ప్రాంతంలో తనకంటూ ఒక ప్రత్యేకతను నిలుపుకొని బలమైన అభ్యర్థిగా ఎదిగారు. ఇలాంటి పరిస్థితుల్లో టిడిపి నుంచి  అనూష రెడ్డి  పోటీ చేస్తూ, రాజకీయ పావులను కదుపుతూ పెద్ది రెడ్డి ని ని ఓడించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి  ఈ సారి  పుంగనూరులో ఎన్నికల రణభేరి గట్టిగానే మోగనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: