తాడిపత్రి నియోజకవర్గంలో లో జేసి కుటుంబానిదే హవా. ఇక్కడ వీళ్ళ పట్టు ఎలా ఉందంటే వరుసగా ఆరు సార్లు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా జెసి దివాకర్ రెడ్డి  గెలుపొందారు. 2014లో జరిగిన రాజకీయ పరిణామాల వలన జెసి కుటుంబం టిడిపి పార్టీలో చేరి దివాకర్ రెడ్డి తమ్ముడు ప్రభాకర్ రెడ్డి  తాడిపత్రి నుంచి మొట్టమొదటిసారిగా పోటీ చేసి అసెంబ్లీ మెట్లు ఎక్కారు. ఇకపోతే వైయస్సార్సీపి  పార్టీ నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి  పోటీ చేయనున్నారు.

ఇంతటి గట్టి పోటీ మధ్య కేతిరెడ్డి తన సత్తా చాటుకుని  గెలవాలని తన వంతుగా కృషి చేస్తున్నారు .అయితే 30 ఏళ్లుగా అధికారంలో ఉన్న జేసీ కుటుంబం తాడిపత్రి లో కనీస అభివృద్ధి కూడా   చేయలేదన్న అపవాదనలు వినిపిస్తూ ఉంటాయి. ఇక  తాగు నీరు సరిగా అందుబాటులో లేక ప్రధాన సమస్యగా మారింది.

దీంతో ప్రజలు కొత్త నాయకుడిని ఎన్నుకునే ఆలోచనలో ఉన్నారని అర్థం అవుతుంది. దీంతో కేతిరెడ్డి  గెలుపు అవకాశాలు  మెండుగా ఉన్నట్లు  కనిపిస్తుంది .ఇదే అదనుగా వైఎస్ఆర్సిపి  దూకుడు పెంచి గెలుపొందాలని గట్టి కసితో వ్యూహాలు రచిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: