ఉత్తరాంధ్ర  జిల్లాల్లో ఆధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైసీపీ అభ్యర్ధులను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. దీంతో ఉన్న రోజులు అన్నీ అలా గడచిపోతున్నాయన్న ఆవేదన అభ్యర్ధులలో కనిపిస్తోంది. మరో వైపు ఎంపీ అభ్యర్ధుల విషయానికి వస్తే ఎక్కడా టైం సరిపోదన్న మాట వినిపిస్తోంది. ప్రతీ ఎంపీ సీటుకూ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. వాటిలో ఒకసారి పర్యటించి వచ్చే సమయమైనా ఉంటుందా అన్నది ఎంపీ అభ్యర్ధులకు  బెంగగా ఉంది. ఇక విశాఖ విషయానికి  వస్తే టీడీపీ  తరఫున ఎంపీ సీటుకు ఇప్పటివరకూ ఎవరినీ  ప్రకటించలేదు. అలాగే ఉత్తరం,  మాడుగుల, చోడవరం, అనకాపల్లి, పాయకరావుపేట అసెంబ్లీ సీట్లతో పాటు, అనకాపల్లి ఎంపీ సీటుకు కూడా అభ్యర్ధుల జాబితా ప్రకటించలేదు. దాంతో పార్టీ వర్గాల్లో  హై బీపీ పెరిగిపోతోంది.


అదే విధంగా వైసీపీ విషయానికి వస్తే ఇదే కధ ఉంది. ఇప్పటికి కూడా మార్పులు చేర్పులు తుది జాబితా కసరత్తులో ఉంటాయని అంటున్నారు. విశాఖ తూర్పులో ఇపుడున్న అభ్యర్ధి వంశీ క్రిష్ణని తొలగించి భీమిలి మాజీ ఇంచార్జి అక్రమాని విజయనిర్మలకు ఇస్తారని అంటున్నారు. అలాగే విశాఖ ఎంపీ సీటు కోసం ఇంకా సమర్ధుడైన అభ్యర్ధి కోసం వేట సాగుతోంది. అరకు, అనకాపల్లి ఎమ్మెల్యే, ఎంపీ సీట్లకు అభ్యర్ధులు చూడాలి. పాయకరావుపేట కూడా పేచీ ఉంది. మరో వైపు పాడేరు, అరకు అసెంబ్లీ సీట్ల  గొడవ కూదా తేల్చలేదు. విశాఖ అర్బన్ జిల్లా వరకూ వస్తే ఉత్తరం సీటు వైసీపీకి  ఇంకా అభ్యర్ధి ఎవరు అవుతారన్నది చూడాలి.


విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల విషయానికి వస్తే అక్కడ కూడా కొన్ని సీట్లలో వైసీపీకి పేచీలు తేలలెదు. నెల్లిమర్ల సీటు కావాలని ఇప్పటికీ బొత్స వర్గం పట్టుపడుతోంది. మరో వైపు సీనియర్ నేత సాంబశివరాజుకి ఈ సీటు ఇవ్వాలని మరో వర్గం కోరుతోంది. పార్వతీపురం లో రెండు వర్గాలు ఉన్నాయి. ఇక్కడ అలజంగి జోగారావుని తప్పించాలని చూస్తున్నారు. శ్రీకాకుళం తీసుకుంటే ఎంపీ సీటు పై పీట ముడి ఉంది. కిల్లి క్రుపారాణీని మంత్రి అచ్చెన్నాయుడు మీద ప్రయోగించాలా, లేక రామ్మోహన్నాయుడు మీదనా అన్నది జగన్ తేల్చుకోలేకపోతున్నారట.


ఇక్కడ టీడీపీకి కూడా అనేక సమస్యలు ఉన్నాయి. విజయ న‌గరం ఎంపీగా అశోక్ గజపతిరాజు ఉంటారా లేక మరొకరా అన్నది తేలలేదు. విజయన‌గరం ఎమ్మెల్యే సీటు కోసం కూడా పెద్ద గొడవే అవుతోంది. మొత్తం మీద చూసుకుంటే టీడీపీ వైసీపీ ల లిస్ట్ ఇంకా తుది దశకు చేరుకోకపోవడంతో ప్రచారం పర్వంలోకి ఎపుడు వెళ్తారన్నది సస్పెన్స్ గా ఉంది. చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: