ఎన్నికలకు ఇంకా నాలుగు వారాలు కూడా లేని సమయంలో టికెట్ల ఖరారుపై దృష్టి సారించిన చంద్రబాబు ఈనెల 16 నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్నారు.  ఆరోజు ఉదయం తిరుపతిలో స్వామి వారిని దర్శించుకుని సమరశంఖం పూరిస్తారు. ఆ మధ్యాన్నం తిరుపతిలో సేవామిత్ర, బూత్ కమిటీల సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. 

chandrababu in canvas కోసం చిత్ర ఫలితం

ఈనెల 16  సాయంత్రం శ్రీకాకుళం సభలో చంద్రబాబు పాల్గొంటారు. 17న విజయనగరం,విశాఖ,ఉభయగోదావరి జిల్లాల్లో సభలు ఉన్నాయి. 18న నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలో చంద్రబాబు సభలు నిర్వహిస్తారు. 

chandrababu meeting public కోసం చిత్ర ఫలితం


19న కర్నూల్, అనంతపూర్, కడప  జిల్లాలో చంద్రబాబు సభలు ఉంటాయి. ఈ సభల తర్వాత చంద్రబాబు బస్ యాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఈ మేరకు టీడీపీ నేతలు రూట్ మేప్ సిద్దం చేస్తున్నారు. 

సంబంధిత చిత్రం


చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు లోకేష్ కూడా యాత్రలకు సిద్ధమవుతున్నారు. చంద్రబాబు ఒక ప్రాంతంలో ఉంటే..లోకేష్ టూర్ ఇంకో ప్రాంతంలో ఉండే విధంగా టీడీపీ ప్లాన్ చేస్తోంది. ప్రధానంగా కేసీఆర్, జగన్‌ కుమ్మక్కయ్యారనే కోణంలోనే చంద్రబాబు ప్రచారం సాగించనున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: