జనసేనాని పవన్ కళ్యాణ్ తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తన పార్టీకి చెందిన అభ్యర్ధుల జాబితాను గత అర్ధరాత్రి ఆయన రిలీజ్ చేశారు. ఈ రోజు పవన్ పార్టీ ఏర్పడి అయిదవ వార్షికోత్సవం జరుపుకుంటోంది. మరో వైపు అన్ని పార్టీల కంటే ముందుగా పవన్ తన తొలి జాబితా విడుదల చేయడం విశేషం.


విశాఖ జిల్లాలో చూసుకుంటే కొన్ని సీట్లకు అభర్ధులను పవన్ డిక్లేర్ చేశారు. విశాఖ ఎంపీ సీటుకు గేదేల శ్రీనివాస్ అనే ఎన్నారైని ఇచ్చారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఆయనకు టికెట్ ఇవ్వడం ద్వార ఆ వర్గం ఓట్లు కొల్లగొట్టాలని పవన్ ప్లాన్ గా కనిపిస్తోంది. ఇక అనకాపల్లి ఎంపీ సీటుకు చింతల పార్ధసారధిని ఎంపిక చేశారు. ఈయన రిటైర్డ్ అధికారిగా ఉన్నారు. ఈయన స్థానికంగా ఉన్న బలమైన‌ సామాజిక వర్గం నుంచి  వచ్చిన వారు. ఈ ఇద్దరు ఎంపీ అభ్యర్ధులు కూడా రాజకీయాలకు కొత్త మరి. 


అదే విధంగా విశాఖ జిల్లా ఎలమంచిలి సీటును సుందరపు విజయకుమార్ కి ప్రకటించారు. ఆయన కూడా  కాపు సామాజికవర్గం నేత. అలాగే పాడేరు ఎమ్మెల్యే సీటుని మాజీ మంత్రి పసుపులేటి బాలరాజుకి కేటాయించారు. ఈ ఇద్దరు కూడా జనసేనలో బలమైనవారే. గెలుపు అవకాశాలు పక్కన పెడితే ఓట్లు బాగానే లాగుతారు. అవి ఎవరికి గండి కొడతాయో ఇపుడు  చెప్పడం కష్టమే. 


పాయకరావుపేట టికెట్ ని నక్కా రాజబాబుకు ఇచ్చారు. ఈయన కూడా రాజకీయలకు కొత్తే మరి. మొత్తం మీద పవన్ తొలి జాబితాలో ఇద్దరు బలమైన‌ అసెంబ్లీ అభ్యర్ధులు ఉన్నారు. అంతా ముందే అనుకుంటునట్లుగా పవన్ పార్టీ ఈ ఎన్నికల్లొ   కీలకమైన పాత్ర పోషించేందుకే పోటీలో ఉంది. మరి ఈ పోటీ వల్ల ఎవరి విజయావకాశాలు దెబ్బ తింటాయన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: