తెలుగుదేశం పార్టీ గురించి గొప్పగా చెబుతారు చంద్రబాబు. తమ పార్టీ చరిత్ర కలిగినదని, స్పూర్తిదాయకమైన పార్టీ అంటారు. తాము వచ్చిన తరువాతనే రాయల‌సీమతో సహా రాష్ట్రమంతటా ప్రశాంత వాతావరణం తీసుకువచ్చామని కూడా చెబుతారు. అదే సమయంలో వైసీపీ మీద నేరస్తుల  పార్టీ, ఫ్రాక్షనిస్టుల పార్టీ అని ముద్ర వేస్తారు. మరి చూస్తూంటే టీడీపీలోనే ఆ తరహా ఫ్రాక్షన్ నేతలు బాగానే ఉన్నారని తెలుస్తోంది.

నిన్నటికి నిన్న అనంతపురం జిల్లా ధర్మవరం  ఎమ్మెల్యే గొనుగుంట్ల సూర్యనారాయణ అలియాస్ వరదాపురం సూరి చేసిన షాకింగ్ కామెంట్స్ ఏపీలో ప్రకంపనలు పుట్టించాయి. ఎన్నికల వేళ బయటపడిన సూరి ఆడియో ఒకటి కొంతమంది టీడీపీ నేతల తీరును చెప్పకనే చెప్పింది. మళ్ళీ బాబు సీఎం అయితే చాలు మనదే అధికారం. పోలీసులు కూడా మన మాటే వింటారు. ఆరు నెలలు చాలు. ప్రత్యర్ధులను లేపేయడానికి అంటూ సూరి చేసినకామెంట్స్ ఇపుడు సంచలనం స్రుష్టిస్తున్నాయి.


దీన్ని ఎవరో ప్రత్యర్ధి వైసీపీ వాళ్ళు బయట పెట్టడం కాదు. ఏకంగా టీడీపీలో సూరి వ్యతిరేకులు అసమ్మతి నేతలు వెలుగులోకి తెచ్చారు. దాంతో ఇది నిజమేనని తేలుతోంది. అంటే రాయలసీమలో కక్షలు ఇంకా ఉన్నాయని సూరి మాటలను బట్టి అర్ధమవుతోంది. అధికారం  సహాయంతో   ప్రత్యర్ధులను మట్టుపెట్టే కల్చర్ కూడా బాగానే ఉందని కూడా తెలుస్తోంది. ఇది నిజంగా దారుణమే. ఓ వైపు మచ్చ లేని నాయకత్వాన్ని అందిస్తామని. తమ అభ్యర్ధుల ఎంపిక చాలా పద్ధతిగా ఉంటుందని  చంద్రబాబు చెబుతున్నారు. 


మరి ఇపుడు బాబు సూరి విషయంలో ఏం చేస్తారు. ఫ్రాక్షన్ బలంతో గెలుస్తారని టికెట్ ఇస్తారా. లేక తాను రోజూ చెబుతున్నట్లుగా ముఠా  కల్చర్ ని  అక్కడ అంతమొందించేనుకు వ్యతిరేకంగా మంచి వారిని నిలబెడతారా అనంది చూడాలి. సూరి మాటలు బాబు పాలన తీరుని కూడా బయటపెడుతున్నాయి. మన ప్రభుత్వమే. మనం ఏమైన చెయొచ్చు అంటూ ఓ ఎమ్మెల్యే స్థాయి నేత అనడం నిజంగా ప్రజాస్వామ్యానికి ప్రమాద‌మే. ఇక సూరి అంతం చేసేది సొంత పార్టీలోని వాళ్ళనా, పోటీలో ఉన్న ప్రత్యర్ధి వైసీపీ నేతలనా. చూడాలి మరి దీని మీద బాబు గారు ఎలా  రియాక్ట్ అవుతారో.


మరింత సమాచారం తెలుసుకోండి: