పశ్చిమ గోదావరి జిల్లా.. గతంలో ఇక్కడ తెలుగుదేశం,బీజేపీ జోడీ క్లీన్ స్వీప్ చేసేసింది. మొత్తం 17 స్థానాలనూ కైవసం చేసుకుంది. టీడీపీ అధికారంలోకి రావడానికి ఈ జిల్లా ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మరి ఈసారి ఈ జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది. సమీకరణాలు ఎలా మారుతున్నాయి. 

west godavari political report కోసం చిత్ర ఫలితం


ఈ అంశంపై సర్వే చేపట్టిన ఓ సర్వే ఫలితాలు ఇలా ఉన్నాయి. మొత్తం 17 స్థానాలు ఉన్న ఈ జిల్లాలో అధికార తెలుగు దేశం పార్టీ 5 స్థానాల్లో మొదటి స్థానంలో ఉంది. మరో 5 స్థానాల్లో సెకండ్ పొజిషన్లో ఉంది. మరో 5 స్థానాల్లో మూడో స్థానంలో ఉంది. అంటే ఈ జిల్లాలో టీడీపీ కనిష్టంగా 5 స్థానాలు.. గరిష్టంగా 10 స్థానాలు గెలుచుకునే ఛాన్స్ ఉంది. 



ఇక ప్రతిపక్ష వైసీపీ విషయానికి వస్తే.. 9 స్థానాల్లో ఈ పార్టీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. మరో 6 స్థానాల్లో సెకండ్ ప్లేస్ లో ఉంది. అంటే ఈ పార్టీ కనిష్టంగా 9 స్థానాలు గెలచుకోవచ్చు. గరిష్టంగా 17 స్థానాలు గెలుచుకోవచ్చు. ఇక ఈ జిల్లాపై ఎన్నో ఆశలుపెట్టుకున్న జనసేన విషయానికి వస్తే.. ఈ జిల్లాలో రెండు స్థానాల్లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. 


మరో 6 స్థానాల్లో జనసేన సెకండ్ పొజిషన్‌లో ఉంది. 7 స్థానాల్లో జనసేన మూడో స్థానంలో ఉంది. అంటే జనసేన ఈ జిల్లాలో కనిష్టంగా 2 స్థానాలు గరిష్టంగా 8 స్థానాలు గెలుచుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటి పొజిష్‌ను బట్టి చూస్తే.. ఓవరాల్‌గా ఈ జిల్లాలో వైసీపీ 9 స్థానాలతో ఫస్ట్ ప్లేస్ లో ఉంటే.. టీడీపీ 5 స్థానాలతో సెకండ్ ప్లేస్ లోనూ.. 2 స్థానాలతో జనసేన మూడో స్థానంలోనూ ఉంది. ఈ జిల్లాలో జనసేన క్రమంగా బలహీనపడుతుంటే.. టీడీపీ పుంజుకుంటోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: