చంద్రబాబునాయుడు బావమరిది కమ్ వియ్యంకుడు చేసిన పని టిడిపిలో కలకలం రేపుతోంది. అభ్యర్ధుల ఎంపికలో చంద్రబాబుదే ఫైలన్ డెసిషన్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇపుడంటే చినబాబుకు కూడా తయారయ్యాడు లేండి. అయితే, రెండు సీట్ల విషయంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని కాదని బాలయ్య గట్టి ఒత్తిడి తెచ్చి తనకు కావల్సిన రెండు సీట్లను సాధింకున్నారట. దాంతో చంద్రబాబుకు ఇష్టం లేకపోయినా ఒత్తిడికి లొంగిపోయి వద్దనుకున్న వాళ్ళ పోటీకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సొచ్చిందట.

 

విషయం ఏమిటంటే,  ప్రకాశం జిల్లాలో కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంఎల్ఏ కదిరి బాబురావు. ఈయన బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడన్న విషయం తెలిసిందే.  రాబోయే ఎన్నికల్లో కదిరికి టికెట్ ఇవ్వదలచుకోలేదు చంద్రబాబు. జరిపించిన సర్వేల్లో కదిరి ఓడిపోతారనే ఫీడ్ బ్యాక్ వచ్చిందట. అదే సమయంలో మాగుంటను ఒంగోలు ఎంపిగా పోటీ చేయాలని చంద్రబాబు ఒకపుడు బాగా ఒత్తిడి పెట్టారు. అప్పట్లో కదిరిని తీసేసి తాన మద్దతుదారుడైన ఉగ్ర నరసింహారెడ్డికి టికెట్ ఇవ్వాలని షరతు పెట్టారట. దాంతో చంద్రబాబు ఒప్పుకుని కనిగిరి టికెట్ ఉగ్రకే ఖాయం చేశారు.

 

కనిగిరి, ఉగ్రలను సమీక్షకు పిలిచిన చంద్రబాబు ఇదే విషయం చెప్పారు. దాంతో కదిరి మిత్రుడు బాలకృష్ణపై ఒత్తిడి తెచ్చారు. వెంటనే బాలయ్య ఫోన్ చేసి చంద్రబాబుకు మాట్లాడారు. తనమిత్రుడికి టికెట్ ఇవ్వకపోతే బాంగుండదన్నట్లుగా మాట్లాడారట. దాంతో చేసేది లేక కదిరిని పిలిచి పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇక రెండో టికెట్ తన చిన్నల్లుడు శ్రీ భరత్ కు కూడా అలాగే ఇప్పించుకున్నారట.

 

విశాఖపట్నం ఎంపిగా పోటీ చేయటానికి భరత్ రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే, లోకేష్ విశాఖపట్నం జిల్లాలో పోటీకి రెడీ అవటంతో భరత్ కు చంద్రబాబు మొండిచెయ్యి చూపారు. అయితే చివరినిముషంలో లోకేష్ విశాఖ జిల్లా నుండి పోటీకి తప్పుకున్నారు. లోకేష్ తప్పుకున్నాక విశాఖ ఎంపిగా చిన్నల్లుడు ఎందుకు టికెట్ ఇవ్వరంటూ చంద్రబాబును బాలయ్య నిలదీశారట. చిన్నల్లుడికి కూడా టికెట్ ఇవ్వాల్సిందేనంటూ బాలయ్య పట్టుబట్టారట.

 

బాలయ్య పట్టుబట్టటంతో ఏమి చేయాలో దిక్కుతోచక చివరకు భరత్ పోటీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని సమాచారం. అంటే సీటు విషయం ఇంకా తేలలేదనుకోండి అది వేరే సంగతి. మొత్తం మీద తన వాళ్ళనుకున్న వాళ్ళకి టికెట్ ఇప్పించుకునే విషయంలో చంద్రబాబుపై బాలయ్య తెచ్చిన ఒత్తిడిపైనే ఇపుడు పార్టీ మొత్తం మీద చర్చ జరుగుతోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: