ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు లోకేశ్ ఇక ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగబోతున్నారు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నమంగళగిరి స్థానం నుంచి లోకేష్ పోటీ చేయబోతున్నారు. గత ఎన్నికల్లో కేవలం 12 ఓట్ల తేడాతో ఇక్కడ టీడీపీ అభ్యర్ధి గంజి చిరంజీవి ఓడిపోవడం విశేషం. 

సంబంధిత చిత్రం

లోకేశ్ ఈ స్థానాన్ని ఎందుకు ఎంచుకున్నారంటే.. 
1. ఇది రాజధాని ప్రాంతం.. ఇక్కడ దాదాపు రైతులంతా టీడీపీకి అనుకూలంగా ఉన్నారు. రాజధాని ప్రాంతం కావడం వల్ల భూములు ఉన్న ప్రతిఒక్కరూ లాభపడ్డారు. అందుకే ఇది లోకేశ్‌కు సురక్షితమైన స్థానం.
2. ఇది వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానం. ఇక్కడ నుంచి గెలిస్తే.. లోకేశ్ కుమ్మేశాడు అంటూ ప్రచారం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. గతంలో వైసీపీ గెలిచినా కేవలం 12 ఓట్లతోనే.. అందుకే ఈ స్థానం లోకేశ్ ఎంచుకున్నారు. 

సంబంధిత చిత్రం


3.  టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తే.. ఈ ప్రాంతంలో భూమలు చాలా కీలకం.. వీటిని ఎవరికి కట్టబెట్టాలన్నా.. ఏం చేయాలన్నా ఇక్కడ లోకేశ్ వంటి వారు ఎమ్మెల్యేగా ఉంటే ప్రభుత్వ ఆటలు నిరాటంకంగా సాగుతాయి. 

4. ఇక్కడ టీడీపీ ఆవిర్బావం నుంచి 1983, 1985 మినహా తెలుగుదేశం ఎప్పుడూ గెలిచింది లేదు. ఈ సీటును పొత్తుల్లో భాగంగా ప్రతి ఎన్నికల్లోనూ వామపక్షాలు, బీజేపీకి ఇస్తూ వచ్చింది. 1985 తర్వాత 2014లోనే మంగళగిరిలో టీడీపీ పోటీ చేసింది. ఈ రికార్డు చెప్పి.. లోకేశ్ వీరత్వాన్ని ప్రచారం చేసుకోవచ్చు. 

lokesh mangalagiri కోసం చిత్ర ఫలితం

5. మంగళగిరి అత్యధికంగా బీసీ ఓట్లున్న నియోజకవర్గం. ఇక్కడ దాదాపు దాదాపు 66 వేల పైచిలుకు బీసీ ఓటర్లు ఉన్నారు. బీసీలు టీడీపీకి ముందు నుంచి అండగా ఉంటున్నారు. పైగా రాజధాని ప్రాంతం కాబట్టి లోకేశ్ సులభంగా గెలవవచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: