గత సార్వత్రిక ఎన్నికల సమయంలో నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ‘జనసేన’ పార్టీ స్థాపించారు.  కానీ పార్టీ తరుపు నుంచి పోటీ చేయలేదు.  ప్రస్తుతం ఏపిలో ఎన్నికల నేపథ్యంలో ఆయన పోటీకి సిద్దమయ్యారు.  జనసేన పార్టీ ఎన్నికల గుర్తుగా గాజు గ్లాసు ఇచ్చిన విషయం తెలిసిందే.  ఇప్పటికే ఎన్నికల అభ్యర్థులు పేర్లు ఖరారు చేసిన పవన్ కళ్యాన్ కొంత కాలంగా ఏపిలో ముమ్మర ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. 

నేడు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరగనుంది. జనసేన పార్టీ ఆవిర్భవించి నేటికి ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించనున్నారు. బుధవారం అర్ధరాత్రి దాటాక పవన్ కళ్యాణ్ 32 మంది పేర్లతో తొలి జాబితాను విడుదల చేశారు. నలుగురు పార్లమెంట్ అభ్యర్థులను కూడా పవన్ ఖరారు చేశారు.

ప్ర‌ధానంగా అభ్య‌ర్ధుల గుణ గ‌ణాల ఆధారంగా ఎంపిక జ‌రిగింద‌ని పార్టీ నేత‌లు చెబుతున్నారు. ఈ రోజు రాజ‌మండ్రి లో జ‌న‌సేన పార్టీ ఆవిర్భావ దినోత్స‌వ స‌భ నిర్వ‌హిస్తున్నారు. ఈ స‌భ త‌రువాత ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల అభ్య‌ర్ధుల ఎంపిక పైనా దృష్టి సారించ‌నున్నారు. 16న వామ‌ప‌క్ష నేత‌లోత స‌మావేశ‌మై పొత్తు లో భాగంగా కేటాయించే స్థానాల‌ను ఖ‌రారు చేయ‌నున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: