ఎన్నికలకి ఇంకా నెలరోజులు కూడా లేవు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా పర్చూరు వైసీపీలో అయోమయం నెలకొంది. అటు టీడీపీ తరుపున మళ్ళీ బరిలోకి దిగుతున్న ఏలూరి సాంబశివరావు ప్రచారంలో దూసుకుపోతుండగా... వైసీపీ కార్యకర్తలు మాత్రం తమ పార్టీ తరుపున అసలు ఎవరు పోటీ చేస్తారని గందరగోళానికి గురవుతున్నారు. అయితే వైసీపీలో ఇంత అయోమయం నెలకొనడానికి కారణం లేకపోలేదు. ఇక్కడ నుండి వైసీపీ తరుపున పోటీ చేయడానికి సిద్ధమైన దగ్గుబాటి వెంకటేశ్వరరావు తనయుడు హితేష్ చెంచురామయ్య ....ఇప్పుడు పర్చూరు బరిలో ఉంటారా లేదనేది తెలియడం లేదు. చెంచురామయ్య అమెరికా పౌరసత్వం రద్దుకాని కారణంగా జగన్...ఆయనకి టికెట్‌ ఇవ్వరని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ టికెట్ దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి ఇస్తారని సమాచారం. 


కానీ ఆయన మీద నియోజకవర్గంలో చాలావరకు వ్యతిరేకిత ఉంది. కొందరు వైసీపీ నేతలు ఆయనకి టికెట్ ఇస్తే సహకరించడం కష్టమే అని తెలుస్తోంది. అయితే ఇంతవరకు పార్టీకి వర్క్ చేసిన రాంబాబుకే టికెట్ ఇవ్వాలని కొందరు కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.  దీంతో జగన్ కూడా మనసు మార్చుకుని పర్చూరు అభ్యర్ధిని మారుస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే వైసీపీ ఆవిర్భావం దినోత్సవం రోజున జరిగిన కొన్ని పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న చెంచురామయ్య ఈ వేడుకలకీ దూరంగా ఉండగా...తండ్రి వెంకటేశ్వరరావు నియోజకవర్గంలో ఉండి వేడుకల్లో పాల్గొనకపోతే ఇబ్బంది అని భావించి హైదరాబాద్ వెళ్ళిపోయారు. 


ఇక పర్చూరులో పార్టీకి ఏకైక దిక్కుగా ఉన్న రాంబాబు...కార్యకర్తలని పిలిపించుకుని వైసీపీ ఆవిర్భావ వేడుకలని చేశారు.అయితే ఈ  వేడుకల్లో కొన్ని ఆసక్తికరమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. అక్కడకి వచ్చిన నేతలు, కార్యకర్తలు...”నువ్వు పార్టీ మారిపోతున్నావ్ కదా...సాంబశివరావు దగ్గరకి వెళ్లిపోతున్నావ్ కదా” అనుకుంటూ ఒకరి మీద ఒకరు జోకులు వేసుకున్నారు.  ఇక ఎన్నికల దగ్గర పడుతున్న పర్చూరు నుండి ఎవరు పోటీ చేస్తారనేది సరిగా తెలియకపోవడంతో కొందరు నేతలు, కార్యకర్తలు పార్టీ మారడానికి కూడా సిద్ధమవుతున్నారు.

అసలు ఇక్కడ నుండి దగ్గుబాటి వాళ్ళు పోటీ చేస్తారా లేక రాంబాబు పోటీ చేస్తారో తెలియడం లేదు. దీంతో వైసీపీలో అనిశ్చితి వాతావరణం నెలకొంది. నామినేషన్ సమయానికి అభ్యర్ది డిక్లేర్ అయిన ప్రచారం చేయడానికి ఎక్కువ సమయం కూడా ఉండదు. ఈలోపు ఏలూరి అన్నీ కార్యక్రమాలని చక్కబెట్టేసుకుని పోటీలో దిగుతారు. మొత్తానికి ఈ పరిణామాలు అన్నీ ఏలూరి విజయానికి ఇంకా ఎక్కువ దోహదం చేస్తాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: