ఇప్పటికి పది నియోజకవర్గాలైపోయాయి. తాజాగా రాజధాని జిల్లాలోని మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోనే లోకేష్ పోటీ చేస్తారని చెబుతున్నారు. అధికారికంగా ప్రకటించకుండా  కేవలం దీన్ని కూడా లీకులతోనే సరిపెట్టారు. సరే ఇదే నిజమనుకున్నా మరి చివరివరకూ ఇదే నియోజకవర్గం ఉంటుందా అన్నదే సస్పెన్స్ గా మారిపోయింది. ఎందుకంటే, ఇప్పటి వరకూ లోకేష్ పోటీ చేస్తారని ప్రచారంలోకి వచ్చిన ఏ నియోజకవర్గంలో కూడా లోకేష్ గెలుపు అంత ఈజీ కాదు. అందుకే ముందుగా లీకులు ఇవ్వటం తర్వాత స్ధానికుల అభిప్రాయాలు తీసుకోవటం తర్వాత నియోజకవర్గాన్ని మార్చేయటం.

 Image result for Alla and lokesh

చివరకు చినబాబు పోటీ చేసే నియోజకవర్గంగా మంగళగిరి ప్రచారంలో ఉంది. ఇక్కడ నుండి పోటీ చేసి గెలవటం అంత ఈజీకాదు. ఎందుకంటే ఇక్కడ సిట్టింగ్ వైసిపి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి. ఆళ్ళ అంటే కొత్తగా ఎవరికీ పరిచయటం చేయాల్సిన పనిలేదు. చంద్రబాబునాయుడు పాలనలోని అవినీతిపై అలుపెరుగని పోరాటాలు చేస్తున్నారు. చాలా అంశాలపై కోర్టుల్లో కేసులు వేసి గెలిచారు కూడా. కొన్నిట్లో స్టేలు కూడా తెచ్చుకున్నారు. వేలంపాట ముసుగులో సదావర్తి భూములను టిడిపి నేతలు చవకగా కొట్టేయకుండా అడ్డుకున్నది ఆళ్ళనే.

 Image result for Alla and lokesh

అలాగే రాజధాని నిర్మాణం పేరుతో రైతులనుండి ప్రభుత్వం బలవంతంగా పొలాలు లాక్కుంటున్న వైనంపై ఆళ్ళ కోర్టుల్లో చాలా కేసులు వేసి స్టేలు తెచ్చారు. ఇక దేశంలోనే సంచలనం రేపిన ఓటుకునోటు కేసులో చంద్రబాబు వెంటపడుతున్నది కూడా ఆళ్ళే. అదే సమయంలో రైతులు పండించిన కాయగూరలు, ఆకుకూరలను కొని చవకగా అందరికీ పంపిణీ చేస్తున్నారు. అంతేకాకుండా దాదాపు ఏడాదిన్నరగా మంగళగిరి పట్టణంలో రాజన్న భోజనం పేరుతో 4 రూపాయలకు రోజు వందాలాది పేదలకు భోజనం పెడుతున్నారు.  

 

సమస్యలపై పోరాటాలు చేయటంలో ముందుండటం ఆళ్ళ ప్రత్యేకత. ఆ ప్రత్యేకతే నియోజకవర్గంలో ఆళ్ళకు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చింది. దాంతో స్ధానికుల్లో ఆళ్ళ బాగా పాతుకుపోయారు. అలాంటి ఆళ్ళపైన ఇపుడు లోకేష్ పోటీ చేద్దామని అనుకుంటున్నారు. కుల, మతాలకు అతీతంగా ఆళ్ళకు అందరూ మద్దతు పలుకుతున్నారు.

 Image result for Alla and lokesh

అటువంటి ఈ నియోజకవర్గంలో టిడిపి చివరిసారిగా పోటీ చేసింది 1985లో. అంటే దాదాపు మూడు దశాబ్దాలుగా ఇక్కడ టిడిపి అభ్యర్ధే లేరు.  ఇటువంటి పరిస్ధితుల్లో ఇక్కడ పోటీ చయేటమంటే లోకేష్ పెద్ద సాహసం చేస్తున్నట్లే లెక్క. అధికారంలో ఉండటం ఒకటే లోకేష్  గెలుపుకు అనుకూలం తప్ప మరే కారణం కనబడటం లేదు. మొత్తానికి రాబోయే ఎన్నికల్లో కీలకమైన నియోజకవర్గాల్లో మంగళగిరి కూడా ఒకటైపోయింది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: