ఎన్నిక‌ల వేళ ప్ర‌తి పార్టీలోనూ టికెట్ల కుమ్ములాటలు స‌ర్వ‌సాధార‌ణం. ఎక్క‌డిక‌క్క‌డ నాయ‌కులు పార్టీ టికెట్ ఇస్తే చాల‌నే ప‌రిస్థితి ఉంటుంది. అయితే, అనూహ్యంగా ఈ ద‌ఫా ఏపీ ఎన్నిక‌ల్లో నాయ‌కులు టికెట్ల వేట‌లో కొంత ఆచి తూచి వ్య‌వ‌హ‌రి స్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే టికెట్ల‌కు ఉన్న డిమాండ్ ఎంపీ టికెట్ల‌కు లేక పోవ‌డం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా.. నాయ‌కులు ఎంపీ టికెట్ల వైపు మొగ్గు చూపేందుకు అవ‌కాశం ఎక్కుగా ఉండేది. ఒకానొక‌ప్పుడు ఎంపీ టికెట్ అంటే.. చాలు ఎగ‌బ‌డిన నాయ‌కులు ఉన్నారు.కానీ, నేడు ఏపీలో మారిన రాజ‌కీయ ప‌రిస్థితి నేప‌థ్యంలో ఎంపీ టికెట్ల కు డిమాండ్ ప‌డిపోయింది. 


న‌ర‌స‌రావుపేట‌, విశాఖ‌, బాప‌ట్ల‌, తిరుప‌తి వంటి కీల‌క‌మైన ఎంపీ సీట్ల‌లో అభ్య‌ర్థుల కొర‌త స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది ఇటు వైసీ పీలోను, అటు అధికార టీడీపీలోనూ టికెట్లను కేటాయించినా పోటీ చేస్తామ‌నే నాయ‌కులు క‌నిపించ‌డం లేదు. ఇక‌, జ‌న సేన స‌హా మిగిలిన ప‌క్షాల ప‌రిస్థితి మ‌రింత దారుణంగా మారిపోయింది. మ‌రి ఇలా ఎందుకు జ‌రుగుతోంది? ఒక‌ప్ప‌టికీ ఇ ప్పటికీ ఎందుకు ప‌రిస్థితిలో మార్పు వ‌చ్చింది? అనే విష‌యాలు ఆస‌క్తిగా మారాయి. ఎప్ప‌టిక‌ప్పుడు ఎక్క‌డిక‌క్క‌డ నాయ‌కులు పోటీ ప‌డే వాతావ‌ర‌ణం పోవ‌డానికి కార‌ణం.. రాష్ట్రం ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లే ప్ర‌ధాన మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 


ఇప్పుడు ఏపీలో ఏ పార్టీ త‌ర‌ఫున ఎక్క‌డ నుంచి ఎంపీ అయినా ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌నే వ్యాఖ్య‌లు త‌ర‌చుగా వినిపి స్తున్నాయి. ప్ర‌త్యేక హోదా, విభ‌జ‌న స‌మ‌స్య‌లు, విశాఖ‌కు వాల్తేర్‌తో కూడిన రైల్వే జోన్ వంటివి సాధించాల్సిన అవ‌స‌రం ఉంది. పైగా కేంద్రంలో మ‌రోసారి మోడీ స‌ర్కారే వ‌స్తే.. ఏంటి ప‌రిస్థితి? అనే ప్ర‌శ్న‌లు కూడా ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. ఇక‌, ఏపీలో అసెంబ్లీకి పోటీ చేస్తే.. ఖ‌ర్చు కూడా పెద్ద‌గా పెట్టాల్సిన అవ‌స‌రం కూడా త‌ప్పుతుంది! పైగా.. ఏ సామాజిక స‌మీక‌ర ణ‌లో క‌లిసి వ‌స్తే .. ఏకంగా మంత్రి ప‌ద‌విని చేప‌ట్టే అవ‌కాశం కూడా ఉంద‌ని నాయ‌కులు భావిస్తున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఎంపీ సీట్ల‌కు పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌డం లేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇక‌, ఆయా టికెట్లు ఆశిస్తున్న వారు మెజా వ్యాపారులు, విదేశాల్లోనూ పారిశ్రామిక వేత్త‌లుగా గుర్తింపు ఉన్న‌వారే క‌నిపిస్తున్నారు. ఇది మ‌రింత విడ్డూరంగా ఉండ‌డం గ‌మ‌నార్హం. 


మరింత సమాచారం తెలుసుకోండి: