రెండున్నర దశాబ్దాలుగా గుంటూరు జిల్లాలోని పొన్నూరు నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చుకున్న టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్....వరుసగా ఆరోసారి గెలిచి డబుల్ హ్యాట్రిక్‌ కొట్టాలని చూస్తున్నారు. వరుసగా 1983, 89ల్లో నరేంద్ర తండ్రి వీరయ్య చౌదరీ టీడీపీ తరుపున గెలిచారు. ఇక తండ్రి తర్వాత నరేంద్ర 1994,99, 2004, 09, 14లలో వరుసగా టీడీపీ తరుపున గెలుస్తూ సత్తా చాటుతున్నారు. అయితే రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా జాతీయ రాజకీయాల్లో చాలా తక్కువ మందికి మాత్రమే సాధ్యం అయిన ఓటమి లేని డబుల్ హ్యాట్రిక్ ఘ‌న‌తను సొంతం చేసుకునేందుకు నరేంద్ర అతి సమీపంలో ఉన్నారు.

Image result for mla dhulipalla narendra

మరి కొద్దీరోజుల్లో జరగబోయే ఎన్నికల్లో కూడా నరేంద్ర పొన్నూరు నుండి టీడీపీ తరుపున మరోసారి బరిలోకి దిగుతున్నారు. ఇక ఇప్పటికే నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడుపుతున్న నరేంద్ర....గత ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సంక్షేమ పథకాలని ప్రజలకి చేరువయ్యేలా చేశారు. అలాగే నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజలకి అందుబాటులో ఉంటూ వస్తున్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేపై సాధారణంగానే కొంత వ్యతిరేకిత ఉంటుంది. ఇక నామినేటేడ్‌ పదవులను ఎమ్మెల్యే సామాజిక వర్గానికి చెందిన వారికే కేటాయిస్తున్నారని విమర్శలు కూడా ఉన్నాయి.


అటు వైసీపీ తరుపున గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన రావి వెంకటరమణ మరోసారి నరేంద్రపై పోటీకి దిగుతున్నారు. ఇక ఈ ఐదేళ్లు ప్రతిపక్ష నేతగా రావి వెంకటరమణ నియోజకవర్గంలో అనేక సమస్యలపై స్పందిస్తూ వచ్చారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధి కూడా నామమాత్రంగానే జరిగిందని నరేంద్రపై విమర్శలు చేస్తూ ఉండేవారు. సందిస్తున్నారు. ఎమ్మెల్యే మీద ఉన్న వ్యతిరేకిత టీడీపీ కంచుకోటగా ఉన్న పొన్నూరులో ఈసారి వైసీపీ గెలవడం ఖాయమని ఆయన భావిస్తున్నారు. మరి ఆర్ధికంగా, రాజకీయంగా బలంగా ఉన్న నరేంద్రని రావి ఎంతవరకు నిలువరించగలరో చూడాలి.


ఈ నియోజకవర్గంలో బీసీలు దాదాపు 80 వేల మంది ఉన్నారు. ఆ తర్వాత ఎస్సీలు 55 వేలు, కాపు 45 వేలు, ముస్లింలు 30 వేలు, కమ్మ 20 వేలు మంది ఓటర్లు ఉన్నారు. మిగిలిన ఇతర సామాజిక వర్గాల్లో ఐదు వేల నుంచి పది వేల వరకు ఓటర్లు ఉన్నారు. అయితే ఎక్కువ శాతం కమ్మ, బీసీ సామాజికవర్గం వారు టీడీపీకే మద్ధతు తెలుపుతుండగా..కాపులు, ముస్లింలు వైసీపీ వైపు ఉన్నారు. ఇక ఎస్సీలు రెండు వైపుల ఉన్నారు.  ఇక రానున్న ఎన్నికల్లో జనసేనకూడా పోటీలో ఉండటంతో కాపు సామాజిక వర్గం ఓటర్లు ఆ  పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది బీసీల టీడీపీ మీద అసంతృప్తితో ఉండటంతో ఈసారి... వారు వైసీపీ వైపు మొగ్గు చూపొచ్చు.  మరి చూడాలి ఈసారి ఎన్నికల్లో నరేంద్ర మరోసారి గెలిచి డబుల్ హ్యాట్రిక్ కొడతారా లేక...నరేంద్రకి చెక్ పెట్టి రావి విజయం సాధిస్తారో  ...!


మరింత సమాచారం తెలుసుకోండి: