చిల‌క‌లూరిపేట‌లో ఈ సారి  ఢీ అంటే ఢీ అనే పేరు నెల‌కొంది. ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో  టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచిన మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు  ఈసారి కూడా పోటీకి సిద్ధ‌మ‌వుతున్నారు. ఇక నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా విడదల రజిని ప్ర‌త్య‌ర్థి కానున్నారు.  వాస్త‌వానికి ఇద్ద‌రి అభ్య‌ర్థిత్వాల‌పై ఇంకా పూర్తి స్ప‌ష్ట‌త రాన‌ప్ప‌టికి వీరిద్ద‌రే బ‌రిలో ఉండ‌టం ఖాయంగా క‌నిపిస్తోంది. ఉండవల్లిలోని సీ ఎం క్యాంపు కార్యాలయంలో శనివారం రాత్రి జరిగిన చిలకలూరిపేట నియోజకవర్గ టీడీపీ బాధ్యుల సమావేశంలో పాల్గొన్నవారంతా ఏ కగ్రీవంగా ప్రత్తిపాటి పేరును ఖరారు చేస్తూ తీర్మానించారు. దీంతో ఆయన పేరును లాం ఛనంగా ప్రకటించడమే మిగిలి ఉంది. ఈలో గా పుల్లారావు యడ్లపాడు మండలం బోయ పాలెం నుంచి ఎన్నికల ప్రచార కార్యక్రమా న్ని ప్రారంభించారు.


ఇక విడ‌ద‌ల ర‌జ‌ని విష‌యానికి వ‌స్తే చిలకలూరిపేట నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా ఆమె పేరు లాంఛ‌న‌మేన‌ని తెలుస్తోంది.  మొద‌ట ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు మర్రి రాజశేఖర్ను అనుకున్నారు. అయితే పుల్లారావుకు గ‌ట్టి పోటీ ఇవ్వాలంటే ర‌జ‌ని అయితే స‌మ‌తూకంగా ఉంటుంద‌ని అధిష్ఠానం భావించి నిర్ణ‌యం మార్చుకున్న‌ట్లు తెలుస్తోంది. అందుకే ర‌జ‌నికి నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలను అప్పగించిన‌ట్లు తెలుస్తోంది. వాస్త‌వానికి మొద‌ట రాజ‌శేఖ‌ర్ పార్టీ కార్య‌క్ర‌మాల‌కు అంటిముట్ట‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించినా ఆ త‌ర్వాత స‌ర్దుకుపోయారు. విడదల రజిని గత కొద్ది నెలలుగా నియోజకవర్గంలో విస్తృతంగా ప ర్యటించి పార్టీ విజయానికై తోడ్పడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గత నాలుగు రోజులుగా చిలకలూరిపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా నా ర్నె శ్రీనివాసరావు ఆఖరి నిముషంలో రంగం లోకి వస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే అందులో వాస్త‌వం త‌క్కువేన‌ని స‌మాచారం అందుతోంది. 


పుల్లారావు సుదీర్ఘ‌కాలంగా ఈ నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయాల్లో కొన‌సాగుతూ వ‌స్తున్నారు. వేలాదిమంది ప్ర‌జ‌ల‌తో ఆయ‌న‌కు ప్ర‌త్య‌క్ష సంబంధాలున్నాయి.  1999 ఎన్నికలలో ఆయన తొలిసారిగా తె లుగుదేశంపార్టీ తరపున పోటీచేసి సుమారు 27వేల ఓట్ల భారీ ఆధిక్యతతో కాంగ్రెస్‌ అభ్య ర్థి సోమేపల్లి సాంబయ్యపై ఘన విజయం సాధించారు. 2004 ఎన్నికలలో తిరిగి ఆయ న టీడీపీ టిక్కెట్‌పై పోటీచేసినప్పటికీ ఇండి పెండెంట్‌ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌ చేతిలో కేవలం 212 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. 

2009లో జరి గిన ఎన్నికలలో పు ల్లారావు టీడీపీ టి క్కెట్‌పై పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌పై 19,813 ఓట్ల ఆధిక్యతతో గెలు పొందారు. 2014లో జరిగిన ఎన్నికలలో మ ర్రి రాజశేఖర్‌ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికలలో పుల్లారావు రాజశేఖర్‌పై 10, 684ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. మంచి రికార్డుతో ఉన్న మంత్రి వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈసారి ఎలాంటి  ఫ‌లితం న‌మోదు చేస్తారోన‌ని నియోజ‌క‌వ‌ర్గ  టీడీపీ శ్రేణులు ఉత్కంఠ‌గా ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: