విచిత్రమేమిటంటే జనసేనలో కూడా టికెట్ల విషయంలో తిరుగుబాట్లు మొదలయ్యాయి. అంటే జనసేనలో  కూడా టిడిపి తరహా రాజకీయం వేడెక్కుతోందన్నమాట. తాడేపల్లి గూడెంలో పవన్ కల్యాణ్ తనకు అన్యాయం చేశారంటూ యర్రా నవీన్ పార్టీకి రాజీనామా చేయటం విచిత్రంగా ఉంది. నిజానికి యర్రా నారాయణస్వామి అంటే పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో తెలియని వారులేరు. నారాయణస్వామి కొడుకే నవీన్. మొన్నటి వరకూ టిడిపిలోనే ఉండేవారు. కాపు కార్పొరేషన్ లో డైరెక్టర్ గా పనిచేస్తున్న నవీన్ ను పవన్ జనసేనలోకి కోరి తెచ్చుకున్నారు.

 

నవీన్ కోసమని పవన్ ఏకంగా నారాయణస్వామి ఇంటికి కూడా వెళ్ళారు. స్వయంగా పార్టీ అధినేతే తమ ఇంటికి వచ్చి ఆహ్వనించారు కాబట్టి నవీన్ కూడా వెంటనే టిడిపికి రాజీనామా చేసి జనసేనలో చేరారు. చేరేటపుడే తాడేపల్లిగూడెంలో సీటు కన్ఫర్మ్ చేశారు. దాంతో గూడెంలోనే ఉంటు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

 

షెడ్యూల్ విడుదలైన తర్వాత రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. దాంతో అభ్యర్ధుల ఫైనలైజేషన్ పై కసరత్తులు పెంచాయి. అందులో భాగంగానే పవన్ కూడా కసరత్తు చేసి మొదటిజాబితాను ప్రకటించారు. అయితే, గూడెంలో తన పేరుకు బదులు బొలిశెట్టి శ్రీనివాస్ పేరు చూసి నవీన కంగుతిన్నారు. తనకు టికెట్ ఇస్తానని చెప్పి చివరకు హ్యాండ్ ఇచ్చారంటూ పవన్ పై మండిపోయారు. చివరకు జనసేనకు రాజీనామా చేసేశారు. చూశారా జనసేనలో కూడా టిడిపి, వైసిపి తరహా రాజకీయ వేడి రాజుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: