రాష్ట్ర విభజన సమయం లో ఆయన ముఖ్యమంత్రి , ఆ తరవాత సమైఖ్య ఆంధ్ర ప్రదేశ్ ఉద్యమం లో కూడా కాస్తంత హడావిడి చేసారు. అవిభజిత ఆంధ్ర ప్రదేశ్ కి ఆఖరి ముఖ్యమంత్రి గా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి మంచి పేరే ఉంది.


రాష్ట్ర రాజకీయాలని ఒక కుదుపు కుదిపిన రాష్ట్ర విభజన టైం లో కీలకంగా వ్యవహరించిన నల్లారి ఆ తరవాత సమైఖ్యాంద్ర అంటూ పార్టీ కూడా పెట్టి అట్టర్ ప్లాప్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారు , ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా లేదా అనేది అర్ధం కాకుండా ఉంది. అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ లోనే జేరిన ఆయన కి అవమానాల మీద అవమానాలు తప్పలేదు.



కిరణ్‌ మాత్రం చురుగ్గా ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నారు. కారణం ఇంటిపోరు. కిరణ్‌ కుమార్ రెడ్డి తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన హౌసింగ్ బోర్డు ఛైర్మన్‌గా నామినేటెడ్ పదవిని అనుభవిస్తున్నాడు.




సొంత ప్రాంతం పీలేరు లో అనుచరులు అందరూ ఆయన తమ్ముడి తోనే ఉన్నారు ప్రస్తుతం. దీంతో ఈ ఎన్నికల్లో ఆయన స్టాండ్ ఏంటి అసలు పోటీ చేస్తారా చెయ్యర అనేది అర్ధం కాకుండా ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: