అంతర్జాతీయంగా  అత్యధిక ఒత్తళ్లను ఎదుర్కొంటున్న దేశం..ఊరంతా ఒక తీరంటే..ఉలిపిరికట్టదొక  తీరన్నట్లుగా ఉండే దేశం, ప్రపంచంతో నాకు పనిలేదు కానీ..ప్రపంచమంతా నేను వ్యాపారం చేయాలనే దేశం, అస్సలు ఏంటీ ఈ దేశం గొప్ప అన్ని చూస్తే.. ఉన్న సహజ వనరులను అడ్డంగా తవ్వెస్తూ..అపారమైన కాలుష్యాన్ని ప్రపంచం మీదకు తోలుతూ..లోపల ఏమీ జరుగుతుందో ప్రపంచానికి తెలియనీయకుండా ఆసియాకు తానే పెద్దన్న అని భావన కలుగజేయాలని చూసే దేశం.  


భారత దేశము నుండి మన దురదృష్టకరమయిన విదేశాంగ విధానం వలన భూమిని, వనరులను కొట్టేసిన దేశం. పాకిస్థాన్ మన దేశం నుంచి కొట్టేసిన భూమిలో సిగ్గు లేకుండా వేల కోట్ల రూపాయలతో దొడ్డి దారి నిర్మించుకుంటున్న దేశం. మళ్లొక్కసారి భారత దేశాన్నే కాదు ఉగ్రవాద వ్యతిరేక నినాదాన్ని వినిపిస్తున్న ప్రపంచాన్ని వెనుపోటు పొడిచింది.  మసూద్ అజార్ ఉగ్రవాది కాదు పొమ్మంది. 

మొత్తం భద్రతా మండలి మసూద్ అజార్ ప్రపంచ శాంతికి భగ్నం అంటే చైనా మాత్రం అతను పాలు తాగే పసిపిల్లాడు అన్నట్ల వ్యవహరిస్తుంది. భారత్ ఇంతకు ముందులా ఏమీ చేతకాని మాటలు మాట్లడే రకం కాదిపుడు..చైనా చాలామ్మా - చెడపకురా చెడేవు. 


మరింత సమాచారం తెలుసుకోండి: