పారిశ్రామిక‌వేత్త జ‌య‌రామ్ హ‌త్య‌కేసులో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. వేగంగా సాగుతున్న ఈ ద‌ర్యాప్తులో కొత్త కోణాలు క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. తాజాగా, విలేక‌రుల స‌మ‌మావేశం నిర్వ‌హించిన‌ వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ కీల‌క అంశాలు పంచుకున్నారు. జయరామ్ హత్య కేసులో మరో ముగ్గురిని అరెస్ట్ చేశామ‌ని, తెలిపారు. అరెస్ట‌యిన అంజి రెడ్డి, కిషోర్ ,సూర్య కేసు దర్యాప్తులో కీలకంగా ఉన్నట్లు తేలిందని పేర్కొన్నారు. హానీ ట్రాప్ చేసి సూర్య జయరామ్‌ను ప్ర‌ధాన నిందితుడు రాకేశ్ దగ్గరకి వచ్చేలా సహకరించాడని తెలిపారు. జయరామ్ ను మభ్యపెట్టి కిషోర్, సూర్యలు తీసుకువ‌చ్చార‌ని పేర్కొన్నారు. అంజి రెడ్డి, రాకేశ్‌కి భూములు కొనుగోలు వ్యవహారం లో పరిచయం ఏర్పడిందని డీసీపీ వివ‌రించారు.
Image result for jayaram murder case

హ‌త్య జ‌రిగిన సంద‌ర్భంగా అంజిరెడ్డి ఉన్నట్లు విచారణలో తేలడంతో అరెస్ట్ చేశామ‌న్నారు. జయరామ్ మృత‌దేహాన్ని కింద దించడానికి ఆయ‌న స‌హ‌క‌రించాడ‌ని పేర్కొన్నారు. జయరామ్ కేస్ దాదాపు విచారణ తుది దశకు చేరుకుందన్నారు. మరో 15 రోజుల్లో జయరామ్ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్నామ‌ని వివ‌రించారు. డిసెంబర్ 2017లో రాకేశ్ రెడ్డి ప్రగతి రిసార్ట్ యాజ‌మాని కుటుంబ సభ్యులపై బెదిరింపులకు దిగినట్లు కొత్త కేస్ తెరమిదికి వచ్చిందన్నారు. జయరామ్ కేస్ తెరమీదకి వచ్చిన తరువాత ప్రగతి రిసార్ట్ వాళ్ళు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేశారన్నారు. ప్రగతి రిసార్ట్ వాళ్ల వద్ద బలవంతంగా రాయించుకున్న స్థలాన్నే అంజిరెడ్డి సహాయంతో అమ్మకానికి ప్రయత్నం చేశారని డీసీపీ పేర్కొన్నారు.

Image result for jayaram murder case

టీడీపీకి చెందిన కొంత మంది మంత్రులకు ఫోన్ కాల్ రాకేశ్ రెడ్డి చేసినట్టు విచారణలో గుర్తించామ‌ని ఏపీ మంత్రులు సంచ‌ల‌న వెల్ల‌డించారు. రాకేశ్‌ రెడీ కాల్ లిస్ట్‌ను అధ్య‌య‌నం చేస్తున్నామ‌న్నారు. రాకేశ్  ఫోన్ చేసిన‌ సదరు మంత్రులు ఎవరు ఉన్నారు అనేది అరా తీస్తున్నామ‌ని వెల్ల‌డించారు. రాకేశ్ రెడ్డిని మరో మారు పోలీస్ కస్టడీలోకి తీస్కుని విచారణ చేస్తామని ప్ర‌క‌టించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: