చంద్రబాబు ఏంచేసినా దేశంలోనో, ప్రపంచంలోనో ప్రథమంగా ఉంటారు. అదీ ఆయన అంకెలగారడీ! దేశమంతా 9% ఓటర్లు పెరిగితే పప్పు నిప్పు పాలనలో 0.3% ఓటర్లు ఏపిలో తగ్గారు! అంటూ  ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. 


తనను ఇబ్బంది పెట్టేందుకే నరేంద్ర మోడీ ఎన్నికలను ఎన్నికల సంఘాన్ని తొలిదశలో పెట్టేలా చేశారని చంద్రబాబు కన్నీళ్లు కారుస్తున్నాడని - కానీ తెలంగాణ, ఏపీల్లో ఒకే రోజు పోలింగ్ జరగడమే ఆయన బాధకు అసలు కారణం. వేర్వేరు తేదీల్లో ఎన్నికలు జరిగితే 2014 మాదిరిగా తెలంగాణ నుంచి పది లక్షల మందిని రప్పించి గెలవ వచ్చన్నది ఆయన ప్రణాళిక అని – స్కెత్చులు, స్కీమ్‌ లు, ఎత్తులు ఇక పనిచేయవు చంద్ర బాబూ! అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. 
Image result for vijayasai reddy Tweets on lokesh cbn
"చంద్రబాబు కు దేవుళ్ళంటే భక్తి లేదని, విశ్వాసం లేదని, కాని వాళ్లను సృష్టించింది తనే నని చంద్రబాబు భ్రమపడతాడు. ఉదయాన్నే తన ఫోటోనే ఎదురుగా పెట్టుకు ని ప్రార్థిస్తాడట. ప్రజలకు నిన్నటి విషయా లేవి గుర్తు రాకుండా చేయమని వేడుకుంటాడట. నరేంద్ర మోదీ చంకలో ఉన్నప్పటి విషయం, దొంగ హామీల విషయం ప్రజలు ఎవరూ ప్రస్తావించొద్దని తనకు తానే మొక్కుకుంటాడు" అని విజయ సాయి ఘాటైన విమర్శలు చేశారు. 
Image result for vijayasai reddy Tweets on lokesh cbn
"ఐదేళ్లలో దేశమంతా ఓటర్ల సంఖ్య 9%పెరిగితే ఏపీలో మాత్రం 0.3%తగ్గింది. మరి ఇది తండ్రి కొడుకుల స్కామ్ అని అర్థమైంది కదా! వీళ్లు తలుచుకుంటే రిజర్వ్ బ్యాంక్‌ ను హ్యాక్ చేసి లక్షల కోట్లు తమ అకౌంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోగలరు. ఇలాంటి నీచులను బంగాళాఖాతం లోకి విసిరేసి ప్రజలు పీడ వదిలించుకుంటారు-దాని కోసమే వాళ్ళు ఎదురుచూస్తున్నారు” అని వైసిపి  నేత మరో ట్వీట్ చేశారు.  
Image result for vijayasai reddy Tweets on lokesh cbn
‘పప్పు కోసం మంగళగిరిని ఇప్పుడు కాదు - ఎప్పుడో డిసైడ్ చేశాడు నిప్పు (తుప్పు) ఎక్కడి నుంచైనా గెలుస్తాడనే బిల్డప్ ఇచ్చేందుకు స్వకుల మీడియా ద్వారా ఇంకో నాలుగు పేర్లు చెప్పించాడు. మంత్రిగా పది మార్కులు రాని పప్పుకు మంగళగిరి ప్రజలు జీవితాంతం గుర్తుండేలా వాతలుపెట్టి, పచ్చబొట్లు పొడిచి వదులుతారు” అంటూ లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేయడం పట్ల విజయసాయి రెడ్డి స్పందించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: