టీడీపీ పార్టీ నాయకులూ చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే అస్సలు చంద్ర బాబును ఖాతరు చేయడం లేదని తెలుస్తుంది. అయితే తన స్థానంలో తన తనయుడు పోటీ చేస్తాడని.. సొంతంగా ప్రకటించేసుకున్న మంత్రి పరిటాల సునీతకు చంద్రబాబు నాయుడు ఝలక్ ఇచ్చారని సమాచారం. తాము రెండు టికెట్లను కోరుతున్నట్టుగా రాప్తాడు నుంచి తను, కల్యాణదుర్గం నుంచి తన తనయుడు శ్రీరామ్ పోటీచేయాలని అనుకుంటున్నట్టుగా సునీత చెప్పుకొచ్చారు.

పరిటాల సునీతకు చంద్రబాబు ఝలక్?

ఒకవేళ చంద్రబాబు నాయుడు ఇద్దరికీ అవకాశాలు ఇస్తే ఓకే అని, ఇవ్వకపోతే తన స్థానంలో రాప్తాడు నుంచి తన తనయుడు శ్రీరామ్ పోటీ చేస్తాడని... సునీత ప్రకటించుకున్నారు. ఒక మంత్రి ఇలా తన అభ్యర్థిత్వం విషయంలో ప్రకటన చేయడం ఆసక్తిదాయకంగా నిలిచింది. అయితే.. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు సీరియస్ అయినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. ఎవరికి వారు ప్రకటించుకోవడం ఏమిటని.. బాబు ఆగ్రహం వ్యక్తం చేశారట.

Image result for chandra babu

తనయుడి అభ్యర్థిత్వం విషయంలో సునీతకు చంద్రబాబు నాయుడు ఓకే చెప్పడం లేదని, ఆమె స్వయంగా పోటీ చేయాల్సిందే అని బాబు అంటున్నారట! పరిటాల సునీత మామూలుగా ఎమ్మెల్యే అయ్యి ఉంటే.. ఆమె స్థానంలో తనయుడు పోటీ చేసుకోవడానికి చంద్రబాబు ఓకే చెప్పేవారని, ఆమె స్వయంగా మంత్రి కాబట్టి.. ఆమె పోటీకి దిగకపోతే జనాలకు రాంగ్ ఇండికేషన్లు వెళ్తాయని బాబు అంటున్నారట. ఆమె పోటీ చేయాల్సిందేనని బాబు స్పష్టం చేశారట. శ్రీరామ్ అభ్యర్థిత్వానికి బాబు నో అంటున్నారని, సునీతే పోటీచేయాలని స్పష్టం చేశారని వార్తలు వస్తున్నాయి!

మరింత సమాచారం తెలుసుకోండి: