ఏపీలో ఇపుడు ఎటు చూసిన రాజకీయం వేడిగా ఉంది. అట్నుంచి, ఇట్నుంచి ఇలా అన్ని వైపుల నుంచి పెద్ద ఎత్తుల చేరికలు సాగుతున్నాయి.  మరో వైపు ఎన్నికలకు పట్టుమని పాతిక రోజులు కూడా లేదు. ఈ టైంలో వచ్చిన అవకాశాన్ని ఎవరైన తమ పార్టీ గురించి. తమ గురించి ఎక్కువగా చెప్పుకుంటారు. లేదా నాలుగు ఓట్లు రాలే విధంగా విమర్శలు చెస్తారు. కానీ జన సేనాని పవన్ కళ్యాణ్ మాత్రం ఎప్పటి మాదిరిగానే ఊకదంపుడు ఉపన్యాసం దంచారు.


రాజమహేంద్రవరంలో జరిగిన తమ పార్టీ అయిదవ వారికొత్సవం వేళ చెప్పాల్సింది చెప్పుకుని ఇప్పటివరకూ అధికారంలో ఉన్న టీడీపీ దుమ్ము దులిపితే నాలుగు ఓట్లు వచ్చేవి. ఏ రాజకీయ పార్టీ అయినా అదే చేస్తుంది. అధికార పార్టీని దించి మాకు అధికారం అప్పగించడని అడుగుతుంది. ఆ విధంగా అధికార పార్టీ అక్రమాలను కూడా ఎండగడుతుంది. కానీ ఏపీలో జనసేనాని  తీరే వేరు కదా. అధికారంలో ఉన్న చంద్రబాబుని అలా పక్కన వదెలేసి జగన్ మీద పడ్డారు.


జగన్ బీసీల కోసం ఏం చేశారు. వాళ్ళ కోసం ఏం చేశారు అంటూ విరుచుకుపడ్డారు. పవన్ స్పీచ్ చూస్తూంటే ఏపీకి జగన్ సీఎం అయ్యాడా అనిపించక మానదు. అంటే రేపో మాపో జగన్ సీఎం అవుతారని వూహించారో ఏమో  తెలియదు కానీ బాబుని వదిలేసి జగన్ మీదనే పవన్ మొత్తం ద్రుష్టి పెట్టారు.  అధికార పార్టీని వదిలేసి ప్రతిపక్షాన్ని విమర్శించడం దేశంలో ఎక్కడా లేని ఈ విధానం ఏపీలో మాత్రమే ఉంది మరి. ఈ విధంగా  పవన్ ఏం సందేశం ఇవ్వదలచుకుంటున్నారో అర్ధం కాదు.


 ప్రతిపక్షం ఓట్లు తనకు వేయమనా పవన్ ఆరాటం. లేక జగన్ని సీఎం చేయకుండా బాబుని చేయమనా పవన్ కోరికనా.  ఏది ఏమైనా పవన్ మళ్ళీ దారి తప్పేశారు. ఆయన స్పీచ్ మొత్తం వన్ సైడెడ్ గా జగన్ని నిందిస్తూ సాగింది. నిజానికి బీసీల గర్జన పేరుతో చంద్రబాబు కూడా అదే రాజమండ్రీలో మీటింగ్ పెట్టారు. మరి పవన్ ఆ సభ పైనా, బాబు పైనా కామెంట్స్ చేయకుండా ఓన్లీ జగన్ అంటున్నారంటే ఇందులో ఏదో మతలబు ఉంది. చూడాలి మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: