దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. వైఎస్సార్‌ సోదరుడు, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కన్నుమూశారు ఈ రొజు  తెల్లవారుజామున గుండెపోటుకు గురయిన వైఎస్‌ వివేకానందరెడ్డి పులివెందులలో మృతిచెందారు. గతంలో మంత్రిగా, ఏంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా వివేకానందరెడ్డి పనిచేశారు. 1989,1994లలో పులివెందుల నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన కడప లోక్‌సభకు కూడా ప్రాతినిథ్యం వహించారు. వైఎస్‌ వివేకానందరెడ్డి మరణంతో పులివెందులలో విషాదఛాయలు అలుముకున్నాయి.


అన్నకు అండగా నిలబడిన నేతగా వివేకా ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఇపుడు  ఆ అన్న కొడుకు జగన్ రాజకీయంగా ఉన్నతంగా ఎదగాలని, దాన్ని తాను కళ్ళారా చూడాలనై వివేకా ఎంతో ఆరాటపడ్డారు. వివేకాకు కడప ఎంపీ సీటు వైసీపీ ఇస్తుందని కూడా ప్రచారం జరిగింది. ఇంతలోనే ఆయన కన్నుమూయడం పెను విషాదమే మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: