ఉత్తరాంధ్ర జిల్లాలు టీడీపీకి కంచుకోటలు. ఆ జిల్లాలలో ఇపుడు పరిస్థితి నెమ్మదిగా మారుతున్నట్లుగా కనిపిస్తోంది. నిన్నటి వరకూ ఉన్న సీన్ మెల్లగా చేంజ్ అవుతోంది. దాన్ని బట్టి చూస్తే వలసలు కూడా అదే రేంజిలో సాగుతున్నాయి. నిన్నటి వరకూ జరగదు అనుకున్నది నేడు  జరిగిపోతోందంటే అందుకు రాజకీయంగా వచ్చిన మార్పే కారణం.


విశాఖ జిల్లాలో పెద్ద నాయకునిగా ఉన్న మాజీ మంత్రి కొణతాలా రామక్రిష్ణ వైసీపీలోకి చేరుతారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఆయన నిన్నటి వరకూ టీడీపీలోకి వస్తారని అంతా భావించారు. అయితే తన అత్మీయులు, అనుచరులతో ఆయన పెట్టిన మీటింగుకు  పెద్ద సంఖ్యలో వచ్చిన వారంతా వైసీపీ నుంచే పోటీకి దిగాలని  గట్టిగా కోరడంతో కొణతాల మనసు మార్చుకున్నారని సమాచారం.


ఇదిలా ఉండగా టీడీపీలో కొణతాలకు ఎంపీ  సీటు  రాకుండాను అడ్డుపుల్లలు వేస్తూ తమ్ముళ్ళు అవమానించడం కూడా మాజీ మంత్రి గారికి బాధ అనిపించినట్లుగా టాక్. అనకాపల్లి ఎంపీ సీటు కావాలని కొణతాల  కోరితే రాజ్యసభ ఇస్తామని టీడీపీ అంటోంది. అయితే కేడర్ మాత్రం ఎంపీగానే పోటీ చేయాలంటూ వత్తిడి తేవడంతో కొణతలా మనసు మార్చుకున్నారని భోగట్టా.
మరో వైపు వైసీపీ కూడా కొణతాలకు అనకాపల్లి ఎంపీ సీటు ఇస్తామని చెప్పడంతో ఆయన ఆ పార్టీ వైపు వెళ్తారని అంటున్నారు. తన రాజకీయ నిర్ణయాన్ని మరో రెండు రోజుల్లో చెబుతానని కొణతాల అనడంతో ఇపుడు టీడీపీకి షాక్ తగిలినట్లైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: