తెలుగుదేశం.. కార్యకర్తల బలం ఎక్కువగా ఉన్న పార్టీ.. తెలుగుదేశం క్రమశిక్షణ మెండుగా ఉన్న పార్టీ.. తెలుగుదేశం ప్రజాసంక్షేమం ధ్యేయంగా పని చేసే పార్టీ.. తెలుగుదేశం బడుగు, బలహీనుల గొంతుగా  ఉన్న పార్టీ.. పైన చెప్పినవన్నీ నిజమే.. కానీ ఇదంతా ఘనమైన గతం. 



అసలు ఇప్పుడు తెలుగుదేశంలో ఏం జరుగుతోంది. ఓ నాయకుడు సీట్లు రాకపోతే బెదిరించేస్తాడు. మరోనాయకుడు ఇష్టారాజ్యం వచ్చినట్టు ప్రజలపై జులుం చేస్తాడు.. మరో నాయకుడు బెదిరించి మరీ టికెట్లు ఇప్పించుకుంటాడు.. ఇంకో నాయకుడు ఉన్నపళంగా పక్క పార్టీలోకి జంప్ చేసేస్తాడు. 


చంద్రబాబును రాజకీయ చాణక్యుడిగా చెబుతుంటారు. కానీ ఇలా ఎందుకు జరగుతోంది..ఎందుకంటే.. తెలుగుదేశం క్రమంగా తన సహజత్వాన్ని కోల్పోయి కాంగ్రెస్ పార్టీ నకలుగా మారిపోతోంది కనుక. బలహీన పడుతున్న  పార్టీని కాపాడుకునే ఉద్దేశంలో వలసలను అడ్డగోలుగా ప్రోత్సహించారు కనుక.

rayapati sambasiva rao కోసం చిత్ర ఫలితం

ఇప్పుడు తెలుగుదేశాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న నాయకులు ఒకప్పుడు కాంగ్రెస్‌ లో చక్రం తిప్పిన వారే. సిద్దాంతాలను పక్కన బెట్టి.. అలాంటి వారినందరినీ దగ్గరకు చేర్చుకున్నారు నారా వారు. కనకపు సింహాసనంబున శునకమును కూర్చొండ బెడితే మాత్రం సహజ గుణం మారుతుందా..  ఇప్పుడు అలాంటి నేతలతోనే తెలుగుదేశం నిండిపోయింది. తన ప్రాభవం కోల్పోయి కాంగ్రెస్‌ పార్టీ జీరాక్స్ గా మారిపోయింది.. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్‌ స్థాయికి పడిపోవడమే మిగిలింది. ఇకనైనా చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవడం మంచిదేమో.  



మరింత సమాచారం తెలుసుకోండి: