మెగస్టార్ చిరంజీవి. స్వయంక్రుషితో టాలీవుడ్ కి రారాజు అయిన కధానాయకుడు. తెలుగు సినిమా చరిత్ర చెప్పాలంటే చిరంజీవి ముందూ తరువాత అన్నంతగా గీత గీసిన లెజెడరరీ పర్సనాలిటీ. చిరంజీవి అభిమాని అని చెప్పుకుని కాలర్ ఎగరేసే వారు కోట్లలో ఉంటారు. మరి మెగా కాంపౌండ్లోనే ఉంటే ఎంత గొప్ప.


అదే వారసత్వంగా తీసుకుని వచ్చిన వారు  పవన్ కళ్యాణ్. తన అన్న చిరంజీవి లేకపోతే పవన్ లేడన్నది అందరికీ తెలిసిందే తరువాత కాలంలో పవన్ తన సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. కానీ ఎప్పటికీ మెగా హీరోలకు మాత్రం చిరు కేరాఫ్ అడ్రస్ అన్నది నిజం. అయితే పవన్ రాజకీయాల్లోకి వచ్చాక పదే పదే తాను కానిస్టేబిల్ కొడుకు అని చెప్పుకోవడంపై సెటైర్లు పడుతున్నాయి


ఆ మాట చెప్పుకోవాల్సింది చిరంజీవి మాత్రమేనని అంటున్నారు. మిగిలిన వారంతా మెగాస్టార్ గొడుగు నీడలో నుంచి వచ్చిన వారేనని కూడా అంటున్నారు. పవన్ ఎక్కడా కష్టపడింది లేదు. ఆయన సినీ జీవితం పూల పానుపు. . ఆయనకు ఈ రోజు కోట్లాది అభిమాన గణం కూడా అక్కడ నుంచి వచ్చిందే. ఆ విధంగా పవన్ చెప్పాల్సింది చిరంజీవి పేరు. అయితే తండ్రిని తలచుకోవడం  వరకూ ఒకే కానీ తానేదే సామాన్యుడిని అని బిల్డప్ ఇచ్చేందుకే పవన్ ఇలా పదే పదే కానిస్టేబిల్ కొడుకుని అని చెప్పుకుంటున్నారని సెటైర్లు పడుతున్నాయి.


 ఆ విధంగా చూస్తే ఏ అండా లేకుండా ఓ కానిస్టేబిల్ కొడుకు పవన్ స్టార్ అయినట్లు, ఆయన ఇపుడు కొత్తగా రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్లుగా పవన్ చెప్పుకుంటున్నారని అంటున్నారు నిజానికి పవన్ చెప్పాల్సింది చిరంజీవి పేరు. ఆయన అండ దండలు లేకపోతే పవన్ సహా ఎవరూ ఇంతటి పేరు తెచ్చుకున్నది లేదు. జనం కూడ పవన్ని ఆరాధిస్తున్నది చిరంజీవి తమ్ముడు గానే. మరి అది మరచి సామాన్యున్ని అంటూ పవన్ ఎంత చెప్పినా జనం నమ్ముతారా.



మరింత సమాచారం తెలుసుకోండి: