మోడీ హయాంలో బాగా చెడ్డపేరు తెచ్చుకున్న అంశం బ్యాంకింగ్. నోట్ల రద్దు ద్వారా జనంలో పలుచన అయ్యారు మోడీ. దీనికితోడు మాల్యా, మోడీ వంటి ఆర్థిక నేరగాళ్లు దేశం విడిచిపోయారు. అందుకే ఈ రంగంపై రాహుల్ దృష్టి పెట్టారు. 



తాము అధికారంలోకి వస్తే.. బ్యాంకింగ్ రంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తామంటున్నారు. మోడీ పాలనలో బ్యాంకింగ్ వ్యవస్ధ వల్ల కేవలం 30 నుంచి 40 మంది మంది మాత్రమే లాభం పొందుతున్నారని రాహుల్  గాంధీ విమర్శించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఎక్కువ మంది యువ వ్యాపారవేత్తలకు రుణాలు అందజేస్తామని కేరళలోని త్రిసూర్ లో మత్స్యకారుల సదస్సులో భరోసా ఇచ్చారు. 




దేశ బ్యాంకింగ్  వ్యవస్ధను కొందరు వ్యక్తులు ఆక్రమించడంలో ప్రధాని మోదీ కీలక పాత్ర పోషించారని రాహుల్ అంటున్నారు. ప్రధాని రైతులు, మత్స్యకారులు, చిరువ్యాపారులను విస్మరించారని.. అనిల్  అంబానీ, నీరవ్ మోడీ లాంటి పారిశ్రామికవేత్తల సమస్యలను ఆలకించేందుకే ప్రాధాన్యమిస్తున్నారని రాహుల్ పైర్ అయ్యారు. 



కాంగ్రెస్  అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్రంలో మత్స్యకారులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని రాహుల్  హామీ ఇచ్చారు. అంతే కాదు.. మధ్యప్రదేశ్ , రాజస్థాన్ , ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్  ప్రభుత్వాలు అమలు చేస్తున్న రైతు రుణమాఫీ గురించి గొప్పగా చెప్పారు. మరి నిజంగానే రాహుల్ గాంధీ అధికారంలోకి వస్తే బ్యాంకింగ్‌ను ఏమాత్రం బాగు చేస్తారో..?



మరింత సమాచారం తెలుసుకోండి: