ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న కాంగ్రెస్ ఎక్కడికక్కడ పొత్తుల విషయంలో క్లారిటీకి వస్తోంది. ఇందులో భాగంగా బీర్ లో ప్రతిపక్ష కూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి వచ్చేసింది. బీహార్లో మొత్తం  40 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి.   ఇక్కడ బలమైన ఆర్జేడీతో కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకుంది. ఆర్జీడీతో పాటు మరికొన్ని పార్టీలు కూడా ఈ కాంగ్రెస్ కూటమిలో ఉన్నాయి. మొత్తం  40 స్థానాల్లో ఆర్జేడీ 19, కాంగ్రెస్  11 చోట్ల పోటీ చేయాలని నిర్ణయించాయి. 


మిగిలిన పది స్థానాలను కూటమిలోని మిగిలిన పార్టీలు పంచుకుంటాయి. ఈ పది స్థానాల్లో ఏ ఏ పార్టీలు పోటీ చేయాలనే అంశంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఈ పది స్థానాల పోటీ విషయాన్ని తేల్చేందుకు ఈ రెండు ప్రధాన పార్టీల నేతలు భేటీ కాబోతున్నారు. 


కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆర్జేడీ ముఖ్యనేత తేజస్వీయాదవ్ రేపు భేటీ అయ్యి పొత్తుల విషయంపై పూర్తి స్పష్టత ఇస్తారని రెండు పార్టీల వర్గాలు చెబుతున్నాయి. ఆ రోజే పొత్తులపై అధికారక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇదే ఉత్సాహంతో మిగిలిన రాష్ట్రాల్లోనూ పొత్తుల సంగతి తేల్చేందుకు కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: