‘జగన్’ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే కాదు, భారత దేశ రాజకీయాలను ప్రభావితం చేయగలదీ పేరు.  తండ్రి చాటు బిడ్డగా ఉంటూ... తండ్రి అనుమానాస్పద హఠాన్మరణంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో తన కుటుంబాన్ని నమ్ముకున్న వారి కోసం తండ్రి పేరు మీదే పార్టీ పెట్టి గత పది ఏళ్లుగా ఏ రాజకీయ నాయకుడు పడనటువంటి అణిచివేత, ఒత్తిడి, బాధలకు ఓర్చి ధృడంగా తాను నమ్మిన సిద్దాంతాల వైపు పయనిస్తున్న నవతర రాజకీయ శక్తి జగన్.

Related image

2014 ఎన్నికలలలో జగన్ ముఖ్యమంత్రి అయితీరుతారని అనుకుంది అశేష ఆంధ్రప్రజ.  తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్లుగా ప్రతిపక్షానికే పరిమితమయ్యారు.

Image result for ys jagan mohan reddy raitu

అపర చాణుక్యుడిగా పేరున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం... జగన్ - అతని ప్రతిపక్షం మాకొక లెక్కే కాదు అన్నట్లుగా చూసిన విధానం దాని  నుండి తనను తాను ఆవిష్కరించుకుంటూ మరల 2019 ఎలక్షన్స్ లో జగనే ముఖ్యమంత్రి అన్నట్లున్న పరిస్థితి జగన్ ని ఒక రాజకీయ శక్తి అని నిరూపించాయి. 

Image result for ys jagan mohan reddy raitu

2014 ఎలక్షన్స్ లో ఓటమికి నారా చంద్రబాబు నాయుడు గారి మంత్రాంగం తో పాటుగా... వైసీపీ - జగన్ లెక్కలేనన్ని స్వయంకృతాపరాధములు, నిక్కచ్చిగా మాటాడితే... జగన్ గారి నాయకత్వ లేమి ప్రధాన కారణం.  

Related image

2019 ఎలక్షన్స్ మరలా 2014 పరిస్థితులనే తలపిస్తున్నాయి. సర్వం జగన్ మయం - సర్వత్రా వైసీపీకే నీరాజనం.  టీడీపీలో అతంర్గత కుమ్ములాటలు, టీడీపీ మీడియాను జనం నమ్మని పరిస్థితి. టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడుతో సహా హేమా - హేమీలు కూడా వైసీపీ తీర్థం తీసుకుంటున్న సందర్భం. 

Image result for ys jagan mohan reddy raitu

ప్రతి వైఎస్సాఆర్ అభిమాని, జగన్ సానుభూతిపరుడు లో ఏదో తెలియని బెంగ-అలజడి, మళ్లీ 2014 లాగా జగన్ ని జగనే ఓడించుకోడు కదా అని.   మొన్న ఎమ్మెల్యే సునీల్ వ్యవహారం... నిన్న రాయపాటి వ్వహారం... రాధ అనుచరుడు కొఠారి రమేష్ వ్యవహారం...  వెనుక ఏదో జగరబోతుందేమో అన్నట్లు వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాయి.


జగన్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం... ఆంధ్ర ప్రజానికం ఆయనకు ఒక అవకాశం ఇవ్వడం ఖాయం-ఆయన చెప్తున్నట్లు ముప్పైఏళ్లు సేవ చేయడానికి దేవుని ఆశీర్వాదం-తండ్రి వైఎస్సాఆర్ ఆశీర్వాదం ఖాయం అన్నట్లున్నపరిస్థితిని జగన్ గారూ...వారి వైఎస్ ఆర్ పార్టీ చెడకొట్టుకోరు.  జగన్ ని జగనే ఓడించుకోరు అని ఆశిద్దాం..

Image result for konathala ramakrishna

కొణతాల రామకృష్ణ వంటి వైఎఎస్ వీర విధేయులను పార్టీలో చేర్చుకోవడం వంటి కార్యకర్తల మనోస్థైర్యాన్ని పెంచే కార్యక్రమాలతో మిగిలిన 26 రోజులు, తరువాత రానున్న కాలంలో జగన్ మరొక వైఎస్సాఆర్, ఎన్టీఆర్ కోవలో నిజమయిన ప్రజానాయకుడు అవుతాడని ఆశిద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: