మైదుకూరు నియోజకర్గంలో రణక్షేత్రం మొదలైపోయింది. ఇక్కడ 13 సార్లు ఎన్నికలు జరుగగా 7 సార్లు కాంగ్రెస్ పార్టీ, రెండు సార్లు టీడీపీ, ఒక సారి వైఎస్సార్సీపీ పార్టీ లు గెలుపొందాయి. నిరుడు వైఎస్సార్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి రఘురామి రెడ్డి ఈ సారి కూడా అందలం ఎక్కలని చూస్తున్నారు. అయితే టీడీపీ టికెట్ ను ఈ సారి కూడా పుట్టా సుధాకర్ యాదవ్ కే కన్ఫర్మ్ చేశారు. మైదుకూరును ఎవరు పరిపాలించిన స్థానిక రైతుల పరిస్థితి లో ఎలాంటి మార్పు రాలేదని అక్కడి వారు వాపోతుంటారు. రఘురాం రెడ్డి మాత్రం అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ప్రజల్లో స్థానం సంపాదించుకున్నారని అలాగే వైయస్సార్సీపీ పార్టీ 2014లో కంటే ఇప్పుడు చాలా మెరుగు పడిందని చెబుతున్నారు. టిడిపి పార్టీ కూడా తమ అ హామీలను ను వెల్లడించి మైదుకూరు పట్టణాన్ని అభివృద్ధి పథంలో లో ని నడుపుతాము అని ధీమా వ్యక్తం చేస్తూ ప్రజలను ఆకర్షితులను చేస్తున్నారు. ఇరు పార్టీల మధ్య పోరు బలోపేతంగా సాగుతుందని అంచనా. కాకపోతే  వైఎస్సార్సీపీ వైపే ప్రజల మొగ్గు చూపుతుందని విశ్లేషకులు తేల్చి చెప్పేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: